అందుకే ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకొన్నా.. అంతకంటే దరిద్రంగా.. డైరెక్టర్ తేజ
సినిమా ఇండస్ట్రీలో ముక్కు సూటిగా మాట్లాడే వారిలో దర్శకుడు తేజ ఒకరు. సినిమా పరంగా తనకు కావాల్సింది రాబట్టుకోవడానికి ఆయన ఎంతకైనా తెగిస్తారు. ఎన్టీఆర్ బయోపిక్‌కు ఆయనే దర్శకుడు. ముహుర్తం షాట్ తర్వాత దర్శకుడిగా తేజ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. తాజాగా సీత అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీను నటించారు. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..

అందుకే తప్పుకొన్నాను
ఎన్టీఆర్ బయోపిక్ సినిమా నుంచి వైదొలగడంపై తేజ వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్ గొప్ప నటుడు, నాయకుడు. నేను ఇష్టపడే హీరోలు ఇద్దరే ఇద్దరు. ఒకరు ఎన్టీఆర్. ఎంజీఆర్. అలాంటి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందే సినిమాకు న్యాయం చేయలేనని అనిపించింది. ఎన్టీఆర్‌ను గొప్పగా చూపించే స్టామినా నాకు లేదనిపించింది. అందుకే తప్పుకొన్నాను అని తేజ అన్నారు.

బాలకృష్ణతో విభేదాలతో సంబంధం లేదు
ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఓపెనింగ్ అయిన తర్వాత కథను లోతుగా పరిశోధన చేశాను. అప్పుడు ఎన్టీఆర్‌కు న్యాయం చేయలేనని అనిపించింది. అంతేకాని బాలకృష్ణతో విభేదాలు రావడం వల్ల బయటకు వచ్చాననే వార్త అబద్ధం. నా వ్యక్తిగత ఆలోచనల ప్రకారమే ఆ సినిమా నుంచి బయటకు వచ్చాను అని తేజ తెలిపారు.

ఎన్టీఆర్ బయోపిక్ చూడలేదని
క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలను చూడలేదు. సినిమా మొత్తంలో ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదు. చూస్తే అందరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి వస్తుందని, ఓపెన్‌గా మాట్లాడితే ఏదొ మాట్లాడితే తలనొప్పి వచ్చేదని సినిమా చూడలేదు. నేను ఆ సినిమా తీయకపోవడంతోనే నాకు మంచి పేరు వచ్చింది అని అందరూ అన్నారు అని తేజ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











