తేజ కొత్త చిత్రం టైటిల్ ఖరారు.. డిజైన్ ఇదే

By Srikanya

Director Teja's new film tilte Tappu
హైదరాబాద్ : వరస పరాజయ్యాల్లో ఉన్న తేజ మరో చిత్రం ప్రారంభించనున్నారు. చిత్రం టైటిల్ తప్పు. ఈ టైటిల్ డిజైన్ ఆయన చేసి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పెట్టారు. పూర్తయ్యాయి. ప్రస్తుతం నటీనటుల అన్వేషణ సాగుతోంది. ఇందుకోసం స్టార్‌హంట్‌ను నిర్వహించబోతున్నారు. సాయిరామ్‌శంకర్ హీరోగా '1000 అబద్ధాలు' నిర్మించిన శ్రీ ప్రొడక్షన్స్ సంస్థ, ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం.

ఈ చిత్రం పూర్తి స్ధాయి డ్రామా గా నడవనుందని తెలుస్తోంది. బడ్జెట్ కంట్రోల్ లోనే ఈ చిత్రాన్ని తేజ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. తేజ ఆ మధ్యన వెంకటేష్ తో రెండేళ్లు కష్టపడి సావిత్రి అనే స్క్రిప్టుని రెడీ చేసుకుని ఓకే చేయించుకున్నారు. వైజాగ్ స్టూడియోలో దాని ఓపినింగ్ కూడా జరిగింది. అయితే అనుకోని విధంగా సురేష్ బాబు ఆ ప్రాజెక్టుని ఆపు చేసేసారు. అయితే ఇప్పుడు ఈ రకంగా కొత్తవారితో ముందుకు వస్తున్నారు.

తేజ మీడియాతో మాట్లాడుతూ.. స్టార్స్‌ని నేను హేండిల్ చేయలేను. వాళ్ల ఇమేజ్ కోసం స్క్రిప్ట్‌లో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. ఇమేజ్‌ని లెక్కలోకి తీసుకోకుండా చేస్తే వాళ్లతో పాటు అభిమానులూ ఒప్పుకోరు. అలా స్టార్ కోసం నేను స్క్రిప్ట్ మార్చలేను. అందుకే ఇప్పటికైతే స్టార్స్‌తో చెయ్యకూడదనే అనుకుంటున్నా. నేను నిజాయితీగా ఉంటా. ఉన్న విషయం మాట్లాడతా అన్నారు. కొత్త వారికి అవకాశాలు ఇవ్వటంలో తేజ ముందు ఉంటారు. ఆయన తొలి చిత్రం 'చిత్రం' నుంచీ ఆయన ఇదే పంథాలో సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు కూడా అదే బాట పట్టారు.

ఇక ప్రేమకథలు తీయడంలో తేజకు ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. 'చిత్రం', 'నువ్వు-నేను', 'జయం' లాంటి సినిమాలతో ఆయన బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. మళ్లీ తన శైలిలో ఓ ప్రేమకథ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ప్రేమలోని గాఢతను ఆవిష్కరిస్తూ తేజ ఈ సినిమా చేయబోతున్నారు అని చెప్తున్నారు. ప్రస్తుతం హీరో హీరోయిన్ల ఎంపిక జరుగుతోంది. పాత, కొత్త తారాగణమంతా ఇందులో నటిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X