twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీత వల్ల ఎంత నష్టమో తెలుసా? తేజ, కాజల్ అంచనాలు తలకిందులు

    |

    సరైన హిట్ కోసం కసిగా ఉన్న డైరెక్టర్ తేజ.. ఈ సారి కాజల్ అగర్వాల్‌ని బాగా నమ్మాడు. ఈమెతో సినిమా చేసి తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలన్న ఆయన ఆశలు ఆవిరయ్యాయి. అటు బెల్లంకొండ శ్రీనివాస్‌దీ అదే పరిస్థితి. కాజల్ లీడ్ రోల్ పోషించిన 'సీత' సినిమా ద్వారా తేజ, బెల్లంకొండలకు లక్కు కలిసొస్తుందనుకుంటే అది కాస్త రివర్స్ అయింది. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా పూర్తిగా డీలా పడిపోయిందని సమాచారం. వివరాల్లోకి పోతే..

    మోడ్రెన్ సీతగా కాజల్ ఎంట్రీ.. భారీ హైప్

    మోడ్రెన్ సీతగా కాజల్ ఎంట్రీ.. భారీ హైప్

    డైరెక్టర్ తేజ సినిమా అంటే ఎంతో కొంత ప్రత్యేకత ఉంటుంది. అలాంటిది ఓ మోడ్రెన్ అమ్మాయి లక్షణాలతో కాజల్‌ని రంగంలోకి దింపుతున్నాడంటే తేజ మ్యాజిక్ సూపర్ గా ఉండే ఉటుందని అంతా భావించారు. దీనికి తోడు విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ లో కనిపించిన కొత్త దనం సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.

    ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రీ రిలీజ్ బిజినెస్

    విడుదలకు ముందు 'సీత' ను బాగా ప్రమోట్ చేయడం, పైగా తేజ ఇదివరకే 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో కాజల్ రోల్ డిఫెరెంట్ గా డిజైన్ చేయడం కారణంగా ఈ సినిమాలో కూడా కాజల్ విలక్షణ పాత్రలో కనిపిస్తుందని ఫిక్స్ అయ్యారంతా. అనుకున్నట్లుగానే టీజర్, ట్రైలర్ లో కాజల్ లేడీ చిరుతలా కనిపించడంతో.. సీత సినిమా 14.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగలిగింది. ఎలాగైనా ఈ సినిమా ద్వారా మంచి లాభాలు వస్తాయని ఆశించారు డిస్ట్రిబ్యూటర్లు.

     తీరా విడుదలయ్యాక.. పరిస్థితి చూస్తే

    తీరా విడుదలయ్యాక.. పరిస్థితి చూస్తే

    మే 24 వ తేదీన సీత సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన రోజే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాత రోజుల్లో డీలా పడింది. ప్రేక్షకులు లేక థియేటర్స్ వెలవెల బోయాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం దాదాపు అన్నిచోట్ల ఈ సినిమా కలక్షన్స్ ముగిసినట్లే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఇప్పటివరకు ఓవరాల్‌గా చూస్తే సీత రాబట్టింది 5 కోట్ల రూపాయలకు కాస్త అటు ఇటుగానే అంటున్నారు.

    సీత తెచ్చిన కష్టాలు

    సీత తెచ్చిన కష్టాలు

    అంటే ఎలా చూసిన సీత సినిమా 10 కోట్ల నష్టమే కూడగట్టుకుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అంత నష్టాల పాలే అయ్యారన్నమాట. ఒకప్పుడు తేజ సినిమా అంటే మినిమం మార్కెట్ ఉండేది కానీ.. కాజల్ నటించిన 'సీత' ద్వారా నేడు ఆ పరిస్థితి కూడా లేదని కన్ఫర్మ్ అయింది. మొత్తంగా చూస్తే.. మోడ్రెన్ సీతపై డైరెక్టర్ తేజ, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరే అన్నమాట.

    English summary
    Director Teja's latest movie 'Sita'. Sai Srinivas Bellamkonda, Kajal Aggarwal played lead roles in this romantic drama. This movie result has not up to the mark. Producers get loss from this movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X