దర్శకుడు తేజ కుమారుడు మరణం...
ప్రముఖ దర్శకుడు తేజ మూడు సంవత్సరాల కుమారుడు శనివారం (మార్చి 19,2011) న హైదరాబాద్ లోని ప్రెవేట్ హాస్పటిల్ లో మరణించాడు.ఆ పిల్లవాడు పుట్టుకతోనే ఓ రేర్ డిసీజ్ తో పుట్టాడు. అప్పటినుంచి తేజ ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నారు. ప్రపంచంలోని బెస్ట్ హాస్పటిల్స్ అంతటికి తిప్పారు. రీసెంట్ గా చైనా కూడా తీసుకువెళ్ళి చూపించారు. అయినా ఆరోగ్యం కుదటపడలేదు. గత వారం రోజులుగా పిల్లవాడి పరిస్ధితి బాగా విషమించింది. శనివారం ఉదయం మరణించాడు. ఆ పిల్లవాడు ఆత్మ శాంతించాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది. ఇక తేజ ప్రస్తుతం వెంకటేష్ తో సావిత్రి ప్రాజెక్టు ఓకే చేయించుకున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేక చి్త్రం తర్వార తేజ ఈ సావిత్రి చిత్రాన్నే చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











