తేజ 'కేక' కథ ఇదా?

By Staff

Keka
వరస ప్లాఫుల అనంతరం తేజ దర్శకత్వం వహిస్తున్న కేక చిత్రం వివరాలు గోప్యంగా ఉంచి అందరిలో ఆసక్తి పెంచుతున్నారు. అయితే ఈ చిత్రం గురించి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జగదీశ్వర రెడ్డి కొన్ని వివరాలు,స్టోరీ లైన్ రివిల్ చేసారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ చిత్రం ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ. హీరోయిన్ కి విలన్ తో ఎంగేజ్ మెంట్ జరుగుతుంది.అయితే అతనికి తెలుసు హీరోయిన్ కీ,హీరోకీ మధ్య ప్రేమ ఉందని. దాంతో అతను తన ప్రేమను త్యాగం చేస్తున్నట్లు నటిస్తూ..హీరో,హీరోయిన్స్ ని మోసం చేద్దామని ట్రై చేస్తాడు.


మొదట హీరో నమ్మి వాళ్ళందరితో హ్యాపీగా పార్టీ చేసుకుంటాడుట (దీనికి సంభందించిన ఎపిసోడ్లే ఆ మధ్య పబ్ లో తీసినవిట) .అయితే హీరో ...అతని కన్నా పెద్ద ఎత్తు వేసి అతని ప్లాన్ ని చిత్తు చేస్తాడు. అదే క్లైమాక్స్ లో హైలెట్ గా నిలుస్తుందిట. అందరూ కేక అనే విధంగా ఆ ఎపిసోడ్ తయారైందిట. అయితే ఇద్దరు హీరోలు ఒక అమ్మాయినే ప్రేమించటంతో ఈ కథ రసకందకంలో పడుతుంది. ఇక వింటానికి ఈ పాయింట్ చాలా పాతది గా అనిపించినా తేజ తయారు చేసిన స్క్రీన్ ప్లే ప్రెష్ ఫీల్ ని తీసుకొస్తుంది.

ముఖ్యంగా కొత్త సన్నివేశాలు కనిపిస్తాయి. అంటున్నాడాయన. ఇక ఈ చిత్రంలో హీరో రాజా ...సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారబ్బాయిట. కంజన అనే ముంబయి మోడల్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తోందిట. అనూప్ విలన్ గా చేస్తున్నాడు. ఇక మిగిలిన వారందరూ సురేష్ ప్రొడక్షన్స్ వారితో తేజా స్టార్ హంట్ చేసి ఎంపిక చేసుకున్న వారేనట. మొత్తం 28 మంది కొత్త ఆర్టిస్టులు ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్నారుట. ఇవే ఇన్నాళ్ళూ తేజా సీక్రెట్ గా ఉంచిన వివరాలు . అదీ సంగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X