For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్టార్ హీరోలు చేసే అతిపెద్ద తప్పు.. వాళ్ల పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు: డైరెక్టర్ తేజ

  |

  చిత్రం, నువ్వు నేను, జయం వంటి బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న టాలెంటెడ్ దర్శకుడు తేజ ప్రస్తుత కాలంలో కూడా తన టాలెంట్ ను చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తున్నాడు. ప్లాప్స్ ఎదురైనప్పటికి వెనుకడుగు వేయకుండా తన ఉనికిని చాటుకుంటున్నారు. అయితే ఇటీవల ఈ సీనియర్ దర్శకుడు నేటితరం స్టార్ హీరోలు ఒక విషయంలో చాలా పెద్ద తప్పు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ పిల్లల జీవితాల్ని వల్లే నాశనం చేస్తున్నట్లు కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

  ఆ సినిమాతోనే భారీ డిజాస్టర్

  ఆ సినిమాతోనే భారీ డిజాస్టర్

  దర్శకుడు తేజ మొదట్లో లవ్ స్టోరీలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకున్నాడు. అయితే రొటీన్ లవ్ స్టోరీస్ ఎక్కువగా తీస్తున్నాడనే మార్క్ పోగొట్టుకోవడానికి నిజం అనే సోషల్ మెస్సేజ్ లాంటి సినిమా తీసి హిట్ కొట్టాలని అనుకున్నారు. కానీ అప్పుడు కూడా డిజాస్టర్ ను ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి ఆయన కెరీర్ లో ఎన్నో సినిమాలు నెగిటివ్ ఫలితాన్ని ఇచ్చాయి.

  పొడిచినా..పొడిచేస్తా..

  పొడిచినా..పొడిచేస్తా..

  ఇక దర్శకుడు తేజ ఎలాంటి కామెంట్స్ చేసినా కూడా కుండబద్దలు కొట్టేలా ఉంటాయని కమరోసారి నిరూపించారు. సినిమా బాగా రావాలి అంటే నటీనటులను కొడతారని గతంలోనే చాలాసార్లు చెప్పిన ఆయన ఇటీవల మరోసారి అదే తరహాలో క్లారిటీ ఇచ్చారు. అవును సినిమా కోసం పొడిచినా పొడిచేస్తా అంటూ సరదాగా కామెంట్ చేశారు. ఒక సినిమా బావుంటే నటినటులకే మొదట మంచి గుర్తింపు వస్తుందని, అయితే కోపంగా చెబుతాను కానీ లిమిట్స్ దాటేలా ఉండనని అన్నారు.

  స్టార్ హీరోలు చేసే బ్లండర్ మిస్టేక్

  స్టార్ హీరోలు చేసే బ్లండర్ మిస్టేక్

  ఇక ప్రస్తుత కాలంలో స్టార్ కిడ్స్ ను బయట ప్రపంచానికి చూపించడంపై డైరెక్టర్ తేజ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్టార్స్ చేసే అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ అదేనని చెప్పారు. అలా విధంగా స్టార్స్ వారి పిల్లల భవిష్యత్తును కూడా రిస్క్ లో పెడుతున్నారని సైకాలజీకల్ గా వారి లైఫ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని అన్నారు.

  అలా చేస్తే నష్టం కలగవచ్చు

  అలా చేస్తే నష్టం కలగవచ్చు

  తేజ మాట్లాడుతూ.. ఒకప్పుడు హీరోల పిల్లలు అంటే వారి సినిమా వచ్చే వరకు తెలియదు. కానీ నేటితరం హీరోలు మాత్రం వారి పిల్లలకు సంబంధించిన ఫొటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరికి తెలిసేలా చేస్తున్నారు. స్కూల్ కు వెళ్లే వయసులో వారి గురించి బయట తెలిస్తే వారి ఎదుగుదలలో ఊహించని నష్టం కలగవచ్చు.

  అలా జరిగితే.. రాక్షసులు అవుతారు..

  అలా జరిగితే.. రాక్షసులు అవుతారు..

  స్టార్ పిల్లలు అని తెలిస్తే చిన్న వయసులో ఇతరుల వాళ్ళ స్కూల్ లో ఎదో ఒక రకంగా ఇబ్బంది పడవచ్చు. ఆ వయసులో తీవ్ర మనోవేదనకు గురయ్యే అవకాశం ఉంటుంది. పైగా కొన్నిసార్లు పిల్లలు రాక్షసంగా కూడా మారవచ్చు. నిజంగా ఇది చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. పిల్లలను వాళ్ళ లైఫ్ ను స్వేచ్ఛగా బ్రతకనివ్వాలి. వీలైనంత వరకు మన పిల్లలు అని బయట సమాజానికి తెలియనివ్వకుండా పెంచాలి.

  హీరోల కెరీర్ కు కూడా పెద్ద డ్యామేజ్..

  హీరోల కెరీర్ కు కూడా పెద్ద డ్యామేజ్..

  హీరోల కెరీర్ కు కూడా ఇది పెద్ద డ్యామేజ్ కావచ్చు. ఎందుకంటే ఒక స్టార్ హీరోకు టీనేజ్ వయసు నుంచి పాతికేళ్ల వయసులోపు అభిమానులు ఎక్కువగా ఉంటారు. సినిమాకు వచ్చేది కూడా ఎక్కువగా అలాంటి వాళ్లే. అయితే హీరోకు పెళ్ళయ్యింది ఫ్యామిలీ ఉంది అని తెలిస్తే యంగ్ జనరేషన్స్ లో ఫ్యాన్ బేస్ తగ్గే అవకాశం ఉంది.. అంటూ తేజ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

  Music Director Thaman Trolled For Copying Another Song
  English summary
  Talented director Teja is presenting his talent in a very different way even in the present times. Despite the flops he continues to make his presence felt without hesitation. Recently, however, the senior director made sensational remarks that today's star heroes are making a big mistake in one respect. Commenting that they are ruining the lives of their children has become a hot topic.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X