మీ నాన్న గొప్పొడు.. నువ్వేం పీకావ్.. గోపీచంద్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ లో తనకుంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు మ్యాచో హీరో గోపీచంద్. ప్రముఖ డైరెక్టర్ టి. కృష్ణ కుమారిడిగా హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన గోపీచంద్ తర్వాత రెండు మూడు సినిమాలోల విలన్ గా అదిరిపోయే పర్ఫామెన్స్ చూపించాడు. తర్వాతి కాలంలో హీరోగా బాగా పాపులర్ అయ్యాడు.
అప్పట్లో వరుసగా మంచి హిట్స్ అందుకున్న గోపీచంద్ కు ఈ మధ్య సరైన విజయం అందలేదు. ఇప్పుడు రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించిన ఇంటర్వ్యూలో గోపీచంద్ పై ప్రముఖ దర్శకుడు తేజ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

బ్లాక్ బస్టర్ హిట్స్: తొలివలపు సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు గోపీచంద్. తర్వాత ఎవరూ చేయనివిధంగా రెండో సినిమాలో విలన్ గా అద్భుతమైన నటన కనబర్చాడు. జయం, నిజం, వర్షం సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. వీటిలో నిజం తప్పా మిగతా రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.
అతనితో మూడోసారి: విలన్ గా మెప్పించిన గోపీచంద్ తర్వాత యజ్ఞం సినిమాతో మళ్లీ హీరోగా సినీ ప్రస్థానం ప్రారంభించాడు. యజ్ఞంతోపాటు ఆంధ్రుడు, రణం వంటి సూపర్ హిట్స్ అందుకున్నాడు. సీటీమార్, ఆరడుగుల బుల్లెట్టు, పక్కా కమర్షియల్ చిత్రాలు అంతగా సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు లక్ష్యం, లౌక్యం వంటి మంచి హిట్స్ అందించిన డైరెక్టర్ శ్రీవాస్ తో ముచ్చటగా మూడోసారి గోపీచంద్ చేసిన సినిమానే రామబాణం.

డింపుల్ హయాతీ.. మే 5: నటిసింహం బాలకృష్ణ సజ్జెస్ట్ చేసిన టైటిల్ తో వస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది. సీనియర్ జగపతి బాబు కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
దర్శకుడితో గొడవలు: ప్రముఖ దర్శకుడు తేజ తాజాగా గోపీచంద్ ను ఇంటర్వ్యూ చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. అందులో రామబాణం సినిమాను బాలకృష్ణ గారితో అనౌన్స్ చేయించేందుకు గల కారణమేంటీ? నీకు బాగా నచ్చిన సినిమా ఏంటీ? ఈ మూవీ షూటింగ్ సమయంలో నీకు డైరెక్టర్ కు గొడవలు జరిగాయంట కదా? అని ప్రశ్నల వర్షం కురిపించాడు తేజ.

తేజ కంటే అతను బెటర్: నీకు ఒక కథ చెప్పాను. ఓకే అన్నావ్. హీరోయిన్ సెట్ కాలేదు. మరొక హీరోయిన్ సెట్ చేసేలోపు నువ్ సడెన్ గా వేరే డైరెక్టర్ తో సినిమా స్టార్ట్ చేశావ్. నేను ఫోన్ చేస్తే నువ్వు అస్సలు ఎత్తలేదు. తేజ కంటే ఈ డైరెక్టర్ బెటర్. ఇతన్నీ తీసి పక్కనేద్దాం. పోన్ చేసినా మనం ఎత్తొద్దు అని తేజ అన్నాడు. మరి మీరెందుకు ఇంత గ్యాప్ ఇస్తున్నారని తేజను గోపీచంద్ అడిగాడు.
నాన్న మంచి పని వల్ల: గోపీచంద్ అడిగినదానికి "నేను వెళ్లి సినిమా చేస్తాను అని ఎవరి దగ్గర నిల్చోను. మీ నాన్న గారు చేసిన మంచి పని వల్ల నీకు జయం సినిమాలో అవకాశం వచ్చింది. నా ఉద్దేశంలో నీకు ఇప్పటివరకు ఆ ఫౌండేషనే రాలేదు. మీ నాన్న గొప్పోడు ఓకే. నువ్వేం పీకావ్" అని షాకింగ్ కామెంట్స్ చేశాడు డైరెక్టర్ తేజ. ప్రస్తుతం ఈ కామెంట్స్, ప్రోమో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











