చచ్చేలోపు ఉదయ్ కిరణ్ చావుకు అసలు కారణం బయటపెడతా.. డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్

సినిమా ఇండస్ట్రీలో ఎంతో భవిష్యత్తు ఉన్నప్పటికీ కూడా ఉదయ్ కిరణ్ అకాల మరణం అప్పట్లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తన ఫ్లాట్లో ఉదయ్ కిరణ్ ఉరివేసుకొని మరణించడం ఇప్పటికి కూడా మిస్టరీగానే ఉంది. అతని మరణంపై చాలా రకాల అనుమానాలు వచ్చినప్పటికీ కూడా ఆ విషయంలో ఎవరూ కూడా సరైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. అయితే ఇటీవల దర్శకుడు తేజ మాత్రం ఉదయ్ కిరణ్ చనిపోవడానికి గల కారణం తనకు తెలుసు అని అతను చనిపోయే ముందు చెప్పాడని కూడా తేజ అన్నారు. ఆ వివరాలలోకి వెళితే..

వరుస విజయాలు

వరుస విజయాలు

తేజ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత మళ్లీ అతని దర్శకత్వంలోనే నువ్వు నేను అనే సినిమా చేశాడు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ కావడంతో ఒక్కసారిగా అతని రేజ్ పెరిగిపోయింది. ఇక అప్పుడే మనసంతా నువ్వే సినిమా కూడా అతనికి మరొక బ్రేక్ ఇచ్చిందే.

ఆ తర్వాత వరుస ఫ్లాప్స్

ఆ తర్వాత వరుస ఫ్లాప్స్

ఇండస్ట్రీకి అడుగుపెట్టిన కొత్తలోనే వరుసగా మూడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు రావడంతో ఉదయ్ కిరణ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక అతనికి అడ్వాన్సులు ఇచ్చి సినిమాలు చేయడానికి ప్రముఖ నిర్మాతలు దర్శకులు పోటీపడ్డారు. అయితే ఉదయ్ కిరణ్ మాత్రం ఆ తర్వాత మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విజయాలు మాత్రం అందుకోలేకపోయాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా తీవ్రంగా నిరాశపరిచాయి.

అందువల్లే మనస్తాపం

అందువల్లే మనస్తాపం

ఒక విధంగా అతను ఎంచుకున్న కథలు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా డిజాస్టర్ అయ్యాయి. అయితే ఉదయ్ కిరణ్ ను ఎదగనివ్వకుండా టార్గెట్ చేసినట్లు కూడా కామెంట్స్ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంలో ఎవరు కూడా డైరెక్ట్ గా కామెంట్ అయితే చేసింది లేదు. ఇక ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యులు కూడా అతను హీరోగా అనుకున్నంత స్థాయికి ఎదగకపోవడం వల్లనే మనస్తాపంతో చనిపోయాడు అని వివరణ ఇచ్చారు.

 కొంత కన్ఫ్యూజ్ అయ్యాడు

కొంత కన్ఫ్యూజ్ అయ్యాడు

అయితే ఉదయ్ కిరణ్ తో ఎక్కువగా సినిమాలు చేసిన దర్శకుడు తేజ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. ఉదయ్ కిరణ్ పతనం కావడానికి అతనికి వరుసగా ఒకేసారి సక్సెస్ లు వచ్చి స్టార్ డం రావడంతో కొంత కన్ఫ్యూజ్ అయ్యాడు అని ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయినప్పుడు నేనే పిలిచి అవునన్నా కాదన్నా అనే సినిమా చేశాను అని అన్నారు.

నాతో చెప్పాడు

నాతో చెప్పాడు

ఇక ఉదయ్ కిరణ్ చనిపోయే కొన్ని రోజుల ముందు కూడా నన్ను కలిశాడు. అప్పుడు అతని జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా నాకు చెప్పాడు. మొత్తం కూడా చెప్పాడు. ఒక విధంగా అతని అమాయకత్వం వల్ల కూడా కొన్ని విషయాల్లో మోసపోవాల్సి వచ్చింది. నేను చనిపోయే లేపు ఉదయ్ కిరణ్ కు సంబంధించిన డెత్ మిస్టరీ గురించి మొత్తం చెబుతాను.. అని తప్పకుండా వివరణ ఇస్తానని దర్శకుడు తేజ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ విషయంలో ఆయన ఎప్పుడూ ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X