For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిజాయితీగా ఒప్పుకున్న డైరెక్టర్ తేజ: నాకు చేతకాదు, హీరోయిన్‌‍‌కి టార్చర్, నిర్మాతలు పనికి రారు..

  |

  బెల్లంకొండ శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరో హీరోయిన్లుగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న చిత్రం 'సీత‌'. మే 24న రిలీజ్ చేస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తేజ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.

  సినిమా ఎవరు తీసినా చాలా బాగా వచ్చిందని చెబుతారు. కానీ నేను అబద్దం చెప్పలేను, నిజం చెప్పలేను. నిజంగా నాకు జడ్జిమెంట్ లేదు. 90 శాతం బావుంది. ఏమైనా తప్పులున్నాయేమో వెతుకుతున్నాను. ఇప్పటికీ సినిమా సూపరా? బావుందా? యావరేజా? అనేది నాకు తెలియదు. ఆడియన్సే చెప్పాలని వ్యాఖ్యానించారు.

  నేను అంత తెలివైన డైరెక్టర్ కాదు

  నేను అంత తెలివైన డైరెక్టర్ కాదు

  సినిమా మొత్తం తీసిన తర్వాత పరుచూరి వెంకటేశ్వరరావుగారిని పిలిచి సార్.. సినిమా ముందు మీరు చూసి తప్పులు ఉంటే నన్ను ఏకండి సార్... రేపు ఆడియన్స్ ఏకడానికి ముందు మీరే ముందు ఏకేస్తే దాన్ని కరెక్ట్ చేసుకుంటాను అన్నాను. వారి సూచన మేరకు కొన్ని మార్పులు చేసి మళ్లీ రీ షూట్ చేశాను. నేను కళ్లజోడు పెట్టుకుని కనిపిస్తా కానీ అంత తెలివైన బ్రెయిన్ కాదు. కళ్లజోడు పెట్టుకున్నవారంతా మేధావులు కాదు... కొంత మంది మాత్రమే మేధావులు ఉంటారని తేజ తెలిపారు.

  అలా చేయడం నాకు చేతకాదు

  అలా చేయడం నాకు చేతకాదు

  ‘సీత'లో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్‌ను కొత్తగా చూస్తారు. మీరు రెగ్యులర్‌గా చూసే కమర్షియల్ స్టైల్ నాకు చేతకాదు... వేరే స్టైల్‌లో చూపించాను. అది అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. థియేటర్లకు వచ్చే వారంతా సంతృప్తిగా బయటకు వెళతారనే నమ్మకం అయితే ఉందని తేజ చెప్పుకొచ్చారు.

  ఆమెను టార్చర్ పెట్టా...

  ఆమెను టార్చర్ పెట్టా...

  ‘‘హీరోయిన్ మన్నారాను నేను కొంచెం టార్చర్ పెట్టాను. బాధ కలిగి ఉంటే సారీ.. కానీ ఆ అమ్మాయి బాగా చేసింది. సినిమాలో అందరూ బానే చేశారు... నేనే నా పనిలో కాస్త యావరేజ్ అనుకుంటున్నాను. వీరందరికీ నేను గ్రేడింగ్ ఇవ్వగలను కానీ నాకు గ్రేడింగ్ ఇచ్చేది ప్రేక్షకులు మాత్రమే. సినిమా చూడండి.. మీకు నచ్చకపోతే నన్ను బాగా తిట్టండి. అలా అయితేనే నెక్ట్స టైమ్ బాగా చేస్తాను.'' అని తేజ వ్యాఖ్యానించారు.

  నన్ను ప్లాప్ డైరెక్టర్ అన్నారు, పర్వాలేదు

  నన్ను ప్లాప్ డైరెక్టర్ అన్నారు, పర్వాలేదు

  ‘నేనే రాజు నేనే మంత్రి' మూడు భాషల్లో రిలీజ్ చేద్దామనుకున్నాం. అపుడు కొన్ని వెబ్ సైట్లు... ఒక ప్లాప్ డైరెక్టర్ సినిమా 3 భాషల్లో అని రాశారు. దీన్ని కూడా నా సినిమాలో కామెడీ వేలో చూపించాను. మీరు నన్ను ఏమన్నా దాన్ని నా సినిమాలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు సినిమా తప్ప మరొకటి రాదని తేజ తెలిపారు.

  నిర్మాతలు ఈ ఇండస్ట్రీకి పనికి రారు

  నిర్మాతలు ఈ ఇండస్ట్రీకి పనికి రారు

  సినిమా నిర్మాతల గురించి చెప్పాలంటే... అనిల్ గారు, కిషోర్ గారు చాలా మంచోళ్లు, మా సినిమా ఇండస్ట్రీకి కూడా పనికి రానంత మంచోళ్లు. వాళ్లకు సినిమా ఇండస్ట్రీ ఒకే కానీ... ఇంత మంచోళ్లను పెట్టుకునేందుకు సినిమా ఇండస్ట్రీకి అర్హత లేదు. వాళ్లు మరిన్ని హిట్లు తీయాలని, విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు తేజ తెలిపారు.

  సీత

  సీత

  బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మ‌న్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా 'సీత' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సోనూ సూద్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

  English summary
  Director Teja Speech at Sita Pre Release Event. Bellamkonda Sai and star heroine Kajal Aggarwal’s upcoming film, Sita will be releasing on May 24th all over. Anil Sunkara and Abhishek Agarwal have jointly produced the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X