twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆయన లెవల్లో తీయలేనేమో అన్నాను: ఎన్టీఆర్ బయోపిక్‌పై దర్శకుడు తేజ

    By Bojja Kumar
    |

    మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంపై తెరకెక్కుతున్న బయోపిక్ ప్రారంభోత్సవం గురువారం ఉదయం నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తేజ ప్రసంగించారు.

    నేను రామారావుగారికి పెద్ద అభిమానిని. ఆయన సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మొదట నన్ను వచ్చి అడిగితే ఆయన లెవల్‌కి నేను తీయలేనేమో అన్నాను. కానీ నిర్మాత విష్ణు గారు మీరే చేయాలి, చేయండి అన్నారు. చాలా అదృష్ణం చేసుకుంటే తప్ప రామారావుగారి సినిమా డైరెక్షన్ చేసే అవకాశం రాదు.. అని తేజ అన్నారు.

    Director Teja Speech NTR Biopic Movie Launch Event

    ఈ సినమాను ఎలాగైనా బాగా తీయడానికి ట్రై చేస్తున్నాను. ఏమైనా చిన్న తప్పులు ఉంటే తర్వాత నన్ను క్షమించాలి. కథ బాగా వచ్చింది, కథతో చాలా హ్యాపీగా ఉన్నాను. బాలకృష్ణ గారు ఎంతో బాగా చేస్తారు. ఇది నేను రాసిన కథ కాదు, జరిగిన కథ. దీన్ని కథ అనడం కంటే చరిత్ర అనడం మంచింది. రామారావుగారిది చాలా గొప్ప చరిత్ర... అని తేజ చెప్పుకొచ్చారు.

    ఈ సినిమా కథ చదువుతుంటే ఒక సినిమా సరిపోదు, ఆరు సినిమాలు తీయాలి. అంత పెద్దగా ఉంది కథ. ఆరు సినిమాల కథ ఒక సినిమాలోకి తేవడానికి మాకు టైమ్ పడుతోంది. సినిమా చాలా బాగా వస్తుందనే నమ్మకం ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే దసరాకు రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం అని తేజ తెలిపారు.

    English summary
    Director Teja Speech #NTRBiopic Movie Launch Event. #NTRBiopic, is launching on 29 March 2018, at Ramakrishna Studios, Hyderabad, by the Honorable Vice President of India, Sri M. Venkaiah Naidu garu, as the Chief Guest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X