Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆసక్తికర విషయం బయటపెట్టిన డైరెక్టర్ తేజ.. ఇదీ అసలు సంగతి అంటూ
ఒక్కో దర్శకుడిదీ ఒక్కో స్టైల్. సినిమాను తెరకెక్కించడంలో ఎంత వినూత్నంగా ఆలోచిస్తారో వెండితెరపై టైటిల్ క్రెడిట్ వేసుకోవడంలోనూ అంతే స్పెషల్‌గా ఆలోచిస్తున్నారు నేటితరం డైరెక్టర్లు. కాలం మారింది ఒకప్పటిలా కాకుండా ఫలానా సినిమా ఏ డైరెక్టర్ తీశాడు? ఆయన ఎంచుకునే కథలు ఎలా ఉంటాయి? వాటిని తెర మీద ఎలా ప్రెసెన్స్ చేస్తున్నారు? ఈ రకంగా పలు కోణాల్లో ఆలోచిస్తున్నారు ఇప్పటి ప్రేక్షకులు. కేవలం హీరో హీరోయిన్లే గాక దర్శకుల మార్క్ కూడా పరిశీలించాకే థియేటర్ వెళ్లాలా? వద్దా? అని డిసైడ్ అవుతున్నాడు సగటు ప్రేక్షకుడు. ఈ నేపథ్యంలో వెండితెరపై తమ పేరును ఎలా, ఎప్పుడు వేస్తే కరెక్ట్ అనే దానిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు డైరెక్టర్లు.
తేజ విషయానికొస్తే..
టాలీవుడ్ ప్రేమ కథల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన డైరెక్టర్లలో మొదటి పేరు తేజ అనే చెప్పుకోవాలి. చిత్రం, నువ్వు నేను, జయం వంటి సినిమాలతో ప్రేమకథ అంటే తేజ స్టైల్ లోనే ఉండాలి అనేంత ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తేజ. అలాగే వెండితెరపై తన పేరును వేయడంలో కూడా తేజది ఓ ప్రత్యేక పంధా. సినిమా పేర్లన్నీ ముందే వేసినా తన పేరును మాత్రం ఇంటర్వెల్‌కి ముందు వేసుకుంటారు తేజ.
పెదవి విప్పిన తేజ
అయితే తేజలోని ఈ ప్రత్యేకమైన స్టైల్‌కి కారణమేంటా? అని ప్రేక్షకులు బాగానే కుస్తీ పట్టినప్పటికీ ఎవ్వరికీ అర్థం కాలేదు. చివరకు తేజనే స్వయంగా తన సీక్రెట్ బయటపెట్టేశారు. తన కొత్త సినిమా సీత ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దీనిని ప్రస్తావిస్తూ అందుకు కారణం వెల్లడిస్తూ పెదవి విప్పారు.
అసలు కారణం ఇదీ.. అందుకే అలా చేస్తా
డైరెక్టర్ తేజ అనే ఉద్దేశంతో ఆడియన్స్ సినిమాను మొదలుపెట్టడం తనకు ఇష్టముండదని తేజ అన్నారు. ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే సరికి సినిమాపై ప్రేక్షకుడికి ఓ అవగాహన వస్తుందని, ఒకవేళ సినిమా బాగుంటే ఇది తేజ సినిమా అనే ఉద్దేశంతో సెకండ్ హాఫ్ చూడవచ్చని.. అలా కాకుండా సినిమా చెత్త అయినా ఆ బాధ్యత తేజదే అని ప్రేక్షకుడికి తెలిసేందుకే ఇలా ఇంటర్వెల్ లో తన పేరును వేస్తానని చెప్పుకొచ్చారు తేజ.
సీత మూవీ
ఇక తేజ డైరెక్షన్లో రాబోతున్న తాజాగా సినిమా సీత విషయానికొస్తే.. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. మోడ్రెన్ సీతగా టైటిల్ రోల్లో కాజల్ పర్ఫార్మెన్స్ అద్వితీయంగా ఉండనుందని టాక్. మన్నార చోప్రా, సోను సూద్, అభిమన్యు సింగ్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించారు. మే 24 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.