బాలకృష్ణతో డైరక్టర్ తేజ చిత్రం..టైటిల్ ??

By Srikanya

హైదరాబాద్ : అప్పట్లో తేజ తాను ఫామ్ లో ఉన్నప్పుడు రజనీకాంత్ తో రైతు అనే చిత్రం చేస్తానని ప్రకటించాడు. అయితే ఆ తర్వాత వరస ప్లాపుల సుడిగుండంలో చిక్కుకున్న తేజ దాని ఊసే ఎత్తలేదు. అయితే తాజాగా ఆ టాపిక్ మళ్లీ ఫిల్మ్ సర్కిల్స్ లో మొదలైంది. దానికి కారణం తేజ మరోసారి ఫిల్మ్ ఛాంబర్ లో రైతు..ద వారియర్ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించటం. దాంతో ఈ చిత్రం స్కిప్టు ఇప్పుడు బయిటకు తీసి,ప్రస్తుత రాజకీయ నేఫద్యంలో వండుతున్నాడని వినిపిస్తోంది. అయితే హీరో ఎవరూ ఏమిటనేది మాత్రం తెలియరాలేదు.

ఇక ఆ మధ్యన నీకు నాకు డాష్ డాష్ చిత్రం డిజాస్టర్ అయ్యాక దగ్గుపాటి రానాతో చిత్రం చేస్తాడని అంతా భావించారు. ఆ మేరకు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా బాలకృష్ణతో తేజ ఈ చిత్రం చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఆ మధ్యన తేజ తాను బాలకృష్ణతో చేయాలని ఆసక్తి ఉన్నట్లు మీడియాతో చెప్పారు. అయితే అలాంటి సామాజిక నేపద్యమున్న సబ్జెక్టుని బాలకృష్ణ లాంటి హీరో చేస్తేనే న్యాయం జరుతుందనేది నిజం. చిత్రం మూవీస్ బ్యానర్ పై తేజ స్వయంగా ఈ చిత్రం నిర్మిస్తూ డైరక్ట్ చేస్తాడని అంటున్నారు.

ప్రస్తుతం సాయిరామ్ శంకర్ హీరోగా దర్శకుడు తేజ ఓ సినిమా చేయబోతున్నారు. రాజేంద్రప్రసాద్‌తో 'సినిమాకెళ్దాం రండి' చిత్రాన్ని నిర్మించిన శ్రీ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. అలాగే సాయిరామ్‌శంకర్ హీరోగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో మరో సినిమా కూడా నిర్మిస్తోంది. నిర్మాతలు సునీత ప్రభాకర్, సీత నెక్కంటి ఆ వివరాలను తెలియజేస్తూ -''తేజ-సాయిరామ్‌శంకర్ కాంబినేషన్‌లో ఓ వైవిధ్యమైన కథాంశంతో సినిమా చేయబోతున్నాం. అక్టోబరులో చిత్రీకరణ మొదలుపెడతాం. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X