తరుణ్ భాస్కర్ స్టార్ హీరోలను అలా అనేశాడేంటి.. కుక్క సావు చస్తామంటూ..
ఆయన సినిమాల్లో మంచి కంటెంట్‌తో పాటు ఫన్నీ కామెడీ కూడా ఏక్ దమ్ బిందాస్‌గా ఉంటూ ఆడియెన్స్ ను కట్టిపట్టేస్తుంది. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ షురూ చేసి రచయితగా, దర్శకుడిగా మంచి ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయారు. అలాగే నటుడిగానూ చక్కని పాత్రలు పోషించి మల్టీ టాలెంటెడ్ గా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఆయనే తరుణ్ భాస్కర్. అయితే క్రేజీ ఎంటర్‌టైనర్స్‌తో యూత్‌ను ఆకట్టుకునే ఆయన.. స్టార్ హీరోలతో సినిమాలు చేసే విషయమై వైరల్ కామెంట్స్ చేశారు. వివరాల్లోకి వెళితే..
తరుణ్ భాస్కర్.. ఈ పేరు యూత్ లో ఓ బ్రాండ్. 'పెళ్లిచూపులు' సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయినా ఆయన తన తొలి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత హీరో విశ్వక్ సేన్ తో కలిసి 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాన్ని తెరకెక్కించి యూత్ హృదయాలను ఆకట్టుకున్నారు. అయితే ఇది కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేదు.

వెబ్ సిరీసుకు దర్శకత్వం: 'పిట్ట కథలు' అనే వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఓ ఎపిసోడ్‌కు డైరె న్ చేశారు. 'మీకు మాత్రమే చెప్తా', 'మహానటి', 'ఫలక్‌నుమా దాస్'.. తదితర సినిమాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు. టీవీ హోస్ట్‌గానూ తన టాలెంట్ చూపించారు. అయితే ఆ తర్వాత నటనలో కాస్త బిజీ అయిపోయారు. రీసెంట్ 'దాస్ కా ధమ్కీ' చిత్రంలోనూ మెరిశారు. ఇందులో ఆయన పాత్ర చిన్నదే అయినా ఆకట్టుకుంది.

ఐదేళ్ల తర్వాత మళ్లీ: కెరీర్ ప్రారంభంలో రెండు ఆకట్టుకునే హిట్ చిత్రాలు తీసి.. ఐదేళ్ల తర్వాత రీసెంట్ గా మెగాఫోన్ పట్టుకుని ఓ సినిమాను ప్రకటించారు. దానికి సంబంధించిన ఓ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. అదే 'కీడా కోలా'. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రచార చిత్రం కూడా ఎంతో ఇంట్రెస్టింగా సా సాగింది. ఇందులో బ్రహ్మానందం కూడా కీలక పాత్ర పోషించారు. సినీ ప్రియులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కుక్క సావు చస్తాం: అందుకే వారితో చెయ్యం.. అయితే తాజాగా భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడ ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. ఎందుకు మీరు స్టార్ అండ్ టాప్ హీరోస్ తో కలిసి పనిచేయరు అని. దాని ఆయన తనదైన స్టైల్ లో వాస్తవాన్నే చెప్పారు. "నాకు తెలుసు మేము ఆడిషన్ చేసి తీసుకునే హీరోస్ కు మార్కెట్ వ్యాల్యూ ఉండదని. మేము కుక్క సావు చస్తుంటాం ఓ సినిమాను మార్కెట్ చెయ్యడానికి.
అయితే ఓ స్టార్ స్టేటస్ ఉన్న హీరో కొన్ని సీన్స్ చెయ్యలేరు. కొన్ని సినిమాలూ చెయ్యలేరు. అవి అభిమానులకు తగ్గటు మార్చాలి. ఒక భిన్నమైన కథ రాసినప్పుడు.. అది కొత్త వాళ్ళతో చెయ్యడానికే సాధ్యం అవుతుంది" అని అన్నారు. ఇక ఈ కామెంట్ల్ విన్నవారు ఇదీ నిజమే అని అంటున్నారు. ఆయన కీడా కోలా చిత్రం మంచిగా ఆడాలని హిట్ అందుకోవాలని ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











