twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తరుణ్ భాస్కర్‌కు చేదు అనుభవం.. మహేష్ ఫ్యాన్స్ ట్రోలింగ్ తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు

    |

    ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది ఏ రేంజ్ లో నడుస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సెలబ్రెటీస్ ఎలాంటి కామెంట్స్ చేసినా విభిన్న రకాలుగా కౌంటర్స్ రావడం ఈ రోజుల్లో కామన్ గా మారిపోయింది. అయితే రీసెంట్ గా దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఒక సినిమాపై అభిప్రాయం చెప్పిన విధానం ఓ వర్గం వారిని హార్ట్ చేసింది. అయితే వారు స్పందించిన తీరు నచ్చకపోవడంతో దర్శకుడు పోలీసులను ఆశ్రయించాడు.

    Recommended Video

    Mahesh Babu ఫ్యాన్స్ పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన Tharun Bhascker ! || Oneindia Telugu
    కమర్షియల్ హీరోలపై కామెంట్స్..

    కమర్షియల్ హీరోలపై కామెంట్స్..

    పెళ్లి చూపులు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ అందుకున్నాడు. అయితే ఇటీవల ఈ దర్శకుడు కప్పేలా అనే మలయాళం సినిమాను చూసి ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పోస్ట్ చేశాడు. సినిమా గురించి చెబితే చెప్పారు గాని ఉహీంచని విధంగా కమర్షియల్ హీరోలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడంతో ఓ వర్గం అభిమానులు గట్టిగానే హర్ట్ అయ్యారు.

    తరుణ్ భాస్కర్ ఏమన్నాడంటే..

    నెట్ ఫ్లిక్స్ లో ఉన్న కప్పేలా అనే మళయాళం సినిమాను చూసి తనకు చెప్పండి అంటూ.. ఈ విధంగా పేర్కొన్నాడు. "హీరో పిచ్చోడిలా గట్టిగా రీసౌండ్ చేసుకుంటూ అరవడు. అందరి కంటే స్మార్ట్‌గా ప్రతి డైలాగ్‌లో సామెత చెప్పడు. ఎక్స్‌ట్రీమ్ స్లో మోషన్లో ఫిజిక్స్ ఫెయిలయ్యేలా ఫైట్లు ఉండవు. ప్రతి రెండు నిమిషాలకూ హీరో రీఎంట్రీ ఉండదు. చివరి పది నిమిషాల్లో రాండమ్‌గా రైతుల గురించో, సైనికుల గురించో, దేశం గురించో మెసేజ్ ఉండదు. మరి దీన్ని కూడా సినిమా అంటారు మరి ఆఊర్లో''.. అని వివరణ ఇచ్చాడు.

    ఆ కామెంట్స్ మహేష్ సినిమాలపైనే..

    ఆ కామెంట్స్ మహేష్ సినిమాలపైనే..

    రైతులు, సైనికులు అనగానే.. ఇటీవల మహేష్ బాబు నటించిన మహర్షి, సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలే అని ఆ స్టార్ అభిమానులు ఉహించుకున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ vs తరుణ్ భాస్కర్ అనేలా ఇటీవల సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో కామెంట్స్ వచ్చాయి. ట్రోలింగ్ ఎక్కువవ్వడంతో తరుణ్ భాస్కర్ కూడా ధిటుగానే స్పందించాడు. ఫేక్ ఐడీలతో ట్రోల్ చేసేవారిని నేను పట్టించుకోనని చెప్పాడు.

    కేసు నమోదు..

    కేసు నమోదు..

    ట్రోలింగ్ డోస్ పెరగడంతో చివరకు తరుణ్ భాస్కర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. రెండు ఫేక్ ట్విట్టర్ ఐడిలను కూడా కనుగొని కేసు నమోదు చేశారు. అలాగే తప్పుడు విమర్శలతో బెదిరింపు ఫోన్ కాల్స్, మెస్సేజ్ లపై కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని తరుణ్ భాస్కర్ వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారుతోంది.

    English summary
    Needless to say, trolling on social media right now is no matter what range. Whatever celebrities have commented on, counters coming in different ways have become common these days. However, director Tarun Bhascker has also commented on a film recently, a category that has made them heartbroken. However, the director complaint against trolling.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X