Trivikram- Samantha: రజినీకాంత్ తర్వాత సమంతనే.. ఆకాశానికి ఎత్తేసిన త్రివిక్రమ్
Trivikram- Samantha: గత వారం పది రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో సమంత (Samantha)పేరు మారుమోగుతోంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha).. బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సమంత పేరు హాట్ టాపిక్ అయింది. తాజాగా మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. సమంతపై చేసిన వ్యాఖ్యలు మరింతగా వైరలవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందో మీరు కూడా ఓ లూక్కేయండి.
వివరాల్లోకెళ్లే..బాలీవుడ్ నటి అలియాభట్, వేదాంగ్ రైనా నటించిన జిగ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఇవాళ నిర్వహించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిధులుగా హీరోయిన్ సమంత, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. హీరోయిన్ సమంతపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'సమంత లో ఉన్న లక్షణాలే అలియాభట్ లో ఉన్నాయనీ, సమంత సెట్ లో ఉన్నంత సేపు డైనమెట్ ఉన్నట్టు ఉంటుందనీ, ఆమె చేసే ఏ షాట్ కూడ అసలు బోర్ కొట్టడు. చనిపోతున్న సీన్ చేస్తూ నవ్వుతూ వెళ్లి.. సీన్ లోకి ఇన్వాల్స్ అవుతుందనీ, లైవ్ డైనమేట్ లా ఉండన్నారు త్రివిక్రమ్.

తెలుగు,తమిళం,మలయాళం, హిందీ ఇలా అన్ని ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఉన్న నటులలో రజనీకాంత్ తర్వాత సమంతే ఉంటారనీ ఆకాశానికి ఎత్తేశారు
త్రివిక్రమ్. సమంత 'ఏం మాయ చేసావే' మూవీ నుంచే హీరో అనీ, ఆమె చేసే సినిమాలకు బన్నీ లాంటి స్టార్ అభిమానులుంటారన్నారు. మీరు కచ్చితంగా హీరోలే.. స్త్రీలకు ఎవరో పవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే.. మిమ్మల్నీ ఎవరో ఏం పవర్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. శక్తి అంటేనే స్త్రీ కాదా.. అందుకే కాదా.. నవరాత్రులు అంటూ స్త్రీలను పూజించుకుంటున్నాం, ప్రపంచానికి చాటి చెబుతున్నాం. మీరే శక్తి కాబట్టి.. మీ శక్తినే మాకు ఇవ్వడంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు త్రివిక్రమ్.
సమంత గారు ముంబైలో జరిగే కార్యక్రమాలకే కాకుండా.. హైదరాబాద్ కూడా అప్పుడప్పుడు రావాలని కోరారు త్రివిక్రమ్. వెంటనే రియాక్ట్ అయినా.. సమంత.. మీరు రాస్తారా? అని సైగ చేసింది. 'మీరు హైదరాబాద్‌లో లేరు, మీరు చేయరేమోననే భయంతో మేం మీకు కథలు రాయడం లేదు. మీరు నటిస్తానంటే మేం రాస్తాం.' అని త్రివిక్రమ్ కామెంట్స్ చేస్తారు. మీరు రాస్తే నేను చేస్తా.. అంటూ సైగలతో రిప్లే ఇచ్చింది సమంత.
'అత్తారింటికి దారేది' లాగా సమంత కోసం 'హైదరాబాద్‌కు దారేది' అనాలేమో. తెలుగు మూవీ లవర్స్ అంతా.. సమంత హైదరాబాద్ రావాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయాలి. ఆమె మళ్లీ తెలుగు సినిమాలలో నటించాలి' అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు త్రివిక్రమ్. ఇదే సమంతలో అలియా భట్ ను విజయం దక్కాలని, మన ఇంట్లోకి వచ్చిన మహాలక్ష్మిని ఓ గొప్ప విజయం అందించి, పంపాలని అంటూ త్రివిక్రమ్ కోరుకున్నారు.
అంతకు ముందు హీరోయిన్ సమంత మాట్లాడుతూ..' హీరోయిన్స్‌గా మాకు ఓ బాధ్యత ఉంది. అమ్మాయిలకు ఎవరి కథలో వారే హీరో అనే విషయాన్ని గుర్తు ఉంచుకోవాలి.ఈ విషయాన్ని ఆలియా భట్ తన సినిమా ద్వారా గుర్తు చేసిందన్నారు సమంత. అలాగే.. రానా నాకు బ్రదర్ లాంటివాడు. అతని లాంటి బ్రదర్ ప్రతి అమ్మాయికి ఉండాలనీ, తెలుగు వారి ప్రేమ వల్లే ఎదిగాను. ఇదే నా కుటుంబం అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది సమంత.


Click it and Unblock the Notifications











