ఇలాంటి సమయంలో ఇది తెలివైన నిర్ణయం: త్రివిక్రమ్
Recommended Video

ఆ నలుగురు, మధు మాసం, అందరి బంధువయతో ప్రేక్షకుల భావోద్వేగాలను స్పృశించిన సెన్సిటివ్ దర్శకుడు చంద్రసిద్ధార్థ్ నుండి వస్తున్న మరో చిత్రం 'ఆటగదరా శివ'. ఉదయ్ శంకర్ కథానాయకుడు. పవర్, లింగా, బజరంగీ భాయీజాన్ చిత్రాలను నిర్మించిన రాక్‌లైన్ వెంకటేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై 20న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచారు. 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా సెట్‌కు వెళ్లి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ చిత్ర బృందాన్ని విష్ చేశారు.

నాకు ఆయన పూజ్యులు
ఆటగదరా శివ చిత్రాన్ని నా ఫ్రెండ్ చంద్ర సిద్ధార్థ్ డైరెక్ట్ చేశారు. మరో ఫ్రెండ్ రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, పూజ్యులు శ్రీరామ్ గారి అబ్బాయి ఉదయ్ శంకర్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతుండటం సంతోషంగా ఉంది అని త్రివిక్రమ్ తెలిపారు.

ఈ సమయంలో తెలివైన నిర్ణయం
టీజర్, ట్రైలర్ చాలా బావున్నాయి. తెలుగు సినీ పరిశ్రమకు ఇదొక కొత్త సినిమా. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు బాగా ఆదరింపబడుతున్న ఈ సమయంలో ఇలాంటి సినిమాతో రావడం ఒక తెలివైన నిర్ణయం. ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంటుందని నమ్ముతున్నాను అన్నారు.

అద్భుతం జరిగేపుడు ఎవరూ గుర్తించరు
హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ నాకు ఇష్టమైన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్. ఇటీవల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా సాంగ్ రిలీజ్ చేశాం. ఇపుడు త్రివిక్రమ్ తన బిజీ షెడ్యూల్ లో కూడా మా సినిమాను విష్ చేయడానికి తన విలువైన సమయం కేటాయించారు. ఇదంతా చూస్తుంటే ఖలేజా సినిమాలో ఓ డైలాగ్ గుర్తొస్తోంది. అద్భుతం జరిగేపుడు ఎవరూ గుర్తించరు. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు. నాకు ఇపుడు అలాగే ఉంది... అన్నారు.

ఆటగదరా శివ
ఉరిశిక్ష నుంచి తప్పించుకుని ఓ ఖైదీ బయటపడతాడు. అనుకోకుండా తనను ఉరితీయాల్సిన తలారినే కలుస్తాడు. వాళ్లెవరన్న విషయం పరస్పరం తెలియకపోవడంతో కలిసి ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణంలో వాళ్లకు ఎదురయ్యే అనుభవాలతో ఈ చిత్రం సాగుతుంది.


Click it and Unblock the Notifications