‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్‌: స్వామి వారు అంటూ... దాటవేసిన త్రివిక్రమ్‌!

By Bojja Kumar

వరుస విజయాలతో టాలీవుడ్లో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అజ్ఞాతవాసి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఊహించని షాకిచ్చారు. త్రివిక్రమ్ సినిమా వస్తుందంటే చాలా మంది ఆయన మేకింగ్ స్టైల్ చూసేందుకే థియేటర్ వరకు వెళతారు. దానికి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లు అదనపు ఆకర్షణ. అయితే 'అజ్ఞాతవాసి' సినిమా విషయంలో త్రివిక్రమ్ కెరీర్లోనే అత్యంత చెత్తగాసినిమా తీశాడనే విమర్శలు మూటగట్టుకున్నాడు.

 శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వచ్చిన త్రివిక్రమ్

శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వచ్చిన త్రివిక్రమ్

శ్రీవారిని దర్శించుకునేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ఫ్యామిలీతో కలిసి గురువారం తిరుమల వచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ను మీడియా వారు సినిమాలకు సంబంధించి వివిధ అంశాలపై ప్రశ్నించేందుకు ప్రయత్నించారు.

Recommended Video

త్రివిక్రమ్ నాకు సలహాలివ్వడు !
 స్వామి వద్ద అలాంటివేమీ వద్దు

స్వామి వద్ద అలాంటివేమీ వద్దు

ఇటీవల విడుదలైన ‘అజ్ఞాతవాసి' సినిమా గురించి, తర్వాత ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా గురించి మీడియా వారు త్రివిక్రమ్‌ను ప్రశ్నించారు. స్వామి వారి సమక్షంలో ఉన్నాం. ఇక్కడ అలాంటివి మాట్లాడటం నాకు ఇష్టం లేదు అంటూ తెలివిగా ఎస్కేప్ అయ్యారు త్రివిక్రమ్.

 ఎలాంటి బాధ లేకుడా కనిపించిన త్రివిక్రమ్

ఎలాంటి బాధ లేకుడా కనిపించిన త్రివిక్రమ్

సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలు అనేవి సర్వ సాధారణం. వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు వెళ్లలేం. తాజాగా త్రివిక్రమ్ కూడా ఇదే పాలసీ పాలో అవుతున్నారు. ‘అజ్ఞాతవాసి' అపజయాన్ని లైట్ తీసుకున్న ఆయన చాలా క్యాజువల్ గా కనిపించారు. అభిమానుల కోరికను కాదనకుండా అందరితోనూ కూల్‌గా ఫోటోలు దిగారు.

 దారుణంగా కలెక్షన్లు

దారుణంగా కలెక్షన్లు

‘అజ్ఞాతవాసి' సినిమాకు రూ. 125 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో విడుదలైన వారం రోజులైనా సగం షేర్ కూడా వసూలు కాలేదు. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు.

 వెంకీ సీన్ కూడా కాపాడలేక పోయింది

వెంకీ సీన్ కూడా కాపాడలేక పోయింది

సంక్రాంతి తర్వాత ‘అజ్ఞాతవాసి' సినిమాలో వెంకీ నటించిన ఓ సీన్ యాడ్ చేశారు. అయితే ఈ సీన్ కూడా సినిమాను కాపాడలేక పోయింది. ఈ సీన్ సినిమాకు ఏ మాత్రం సూట్ కాలేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

 చెత్తగా ఉన్న అదనపు సీన్

చెత్తగా ఉన్న అదనపు సీన్

సినిమాలో యాడ్ చేసిన పవన్-వెంకీ సీన్ చాలా చెత్తగా ఉందని, ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇలాంటి చెత్త సీన్ ఉంటుందని అసలు ఊహించలేదని పలువురు ప్రేక్షకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. త్రివిక్రమ్ చాలా తెలివైన దర్శకుడు అనుకున్నాంకానీ... ఇలాంటి తెలివి తక్కువ సీన్లు పెడతారని అస్సలు ఊహించలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 ఎన్టీఆర్ సినిమాపై కూడా స్పందించలేదు

ఎన్టీఆర్ సినిమాపై కూడా స్పందించలేదు

‘అజ్ఞాతవాసి' తర్వాత మీ నెక్ట్స్ చిత్రం ఎలా ఉండబోతోంది, ఎన్టీఆర్‌తోనే ఈ సినిమా ఉండబోతోందా? అనే ప్రశ్నకు కూడా త్రివిక్రమ్ ఏమీ మాట్లాడకుండా దాటవేశారు.

 ఎన్టీఆర్ మూవీపై పుకార్లు షికార్లు

ఎన్టీఆర్ మూవీపై పుకార్లు షికార్లు

‘అజ్ఞాతవాసి' సినిమా ప్లాప్ కావడంతో ఎన్టీఆర్ మనసు మార్చుకున్నారని.... ప్లాప్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో చేయడానికి ఇష్టం పడటం లేదని ఫిల్మ్ నగర్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇదంతా వాస్తవం కాదని త్రివిక్రమ్ సన్నిహితులు అంటున్నారు.

 అనిరుధ్ విషయంలో కూడా

అనిరుధ్ విషయంలో కూడా

‘అజ్ఞాతవాసి' సినిమాకు అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు పెద్ద మైనస్ అయిందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తన తర్వాతి సినిమాకు అతడి స్థానాన్ని డీఎస్పీతో రీప్లేస్ చేస్తారనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X