త్రివిక్రమ్ మరో మినీ ప్రాజెక్ట్.. 'అఆ' కంటే చిన్నగా..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొత్తానికి అల..వైకుంఠపురములో.. సినిమాతో ఫామ్ లోకి వచ్చేశాడు. అజ్ఞాతవాసి డిజాస్టర్ అనంతరం ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత కూడా అనుకున్నంతగా ఆడలేదు. ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని అల్లు అర్జున్ తో అలా.. హిట్టు కొట్టేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో త్రివిక్రమ్ తదుపరి సినిమాకు సంబంధించిన రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్మాతలు కళ్యాణ్ రామ్ , చిన బాబు షెడ్యూల్స్ కి సంబంధించిన ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. దాదాపు స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి చేసుకున్న త్రివిక్రమ్ లాక్ డౌన్ కారణంగా వచ్చిన గ్యాప్ లో సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కొన్నిటిని పెండింగ్ లో పెట్టాడట. అయితే సమయాన్ని వృధా చేయకూడదని త్రివిక్రమ్ ఒక చిన్న బడ్జెట్ కథను రాసుకున్నారట.

Director Trivikram srinivas new project with mini budget

ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా వల్ల బిజీ అయితే ఆ గ్యాప్ లో చిన్న స్టార్స్ తో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్.. నాని, నాగ చైతన్య వంటి యంగ్ హీరోలతో టచ్ లో ఉంటున్నట్లు టాక్ వస్తోంది. ఏదేమైనా లాక్ డౌన్ తరువాత పరిస్థితులను బట్టి త్రివిక్రమ్ 'అఆ' సినిమా తరహాలో ఒక చిన్న కథను చూపించడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X