Trivikram Srinivas: అల్లు అర్జున్‌కు అవార్డు రావడంలో ఆశ్చర్యం ఏముంది?
69వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఉత్తమ నటుడిగా పుష్ప చిత్రానికి గానూ అల్లు అర్జున్ కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. ఇక అల్లు అర్జున్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. అల్లు అర్జున్ ఈ అవార్డు సాధించడం త్రివిక్రమ్ కు ఎలాంటి ఆశ్చర్యం లేదంటూ ఓ సుదీర్ఘ నోట్ ను విడుదల చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే...
69వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఉత్తమ నటుడిగా బన్నీ ఎంపిక అయిన సంగతి తెలిసిందే. దేశ ప్రధాని దగ్గర నుంచి సినీ ప్రముఖల వరకు అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించారు. నిన్న తెలుగు వారంతా సంబరాలు జరుపకున్నారు. 69 ఏళ్లలో ఏ తెలుగు హీరోకు దక్కని అవార్డు అల్లు అర్జున్ కు దక్కడంపై అంతా హర్షం వ్యక్తం చేశారు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్హున్ హీరోగా తెరకెక్కిన పుష్ప చిత్రం. ఇక 2021 డిసెంబర్ నెలాఖరులో విడుదల అయిన ఈ చిత్రం ఓ సెన్సెషన్ క్రియేట్ చేసింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా... సునీల్, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. ఇక వారితో పాటు.. సమంత ఓ ఐటెం సాంగ్ లో నటించి దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది.

ఇక పుష్ప చిత్రంలో నటనకు అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. ఇక ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక స్పెషల్ నోట్ షేర్ చేశారు. ఆయన అల్లు అర్జున్ గురించి కీలకమైన కామెంట్స్ చేశారు. ఆయన నోట్ లో ఏం రాశారంటే... జాతీయ అవార్డును కైవసం చేసుకుని, ఈ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా తన స్థానాన్ని సంపాదించుకున్న అల్లు అర్జున్ అద్భుతమైన విజయాన్ని చూసి నేను నిజంగా ఆశ్చర్యపోలేదు.. అంటూ రాసుకొచ్చారు.
అల్లు అర్జున్ సినిమాల్లో చేసే పాత్రల కోసం ఆయన ఎంత కష్ట పడతాడో దగ్గరి నుంచి అంకితభావం, అభిరుచి గమనించిన తనకు ఆ అవార్డు ఆశ్చర్యం ఏమీ అనిపించలేదు. సినిమా మీద ఆయనకు ఉన్న నిబద్ధతను గుర్తించే మరిన్ని అవార్డులు భవిష్యత్తులో లభిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని త్రివిక్రమ్ వెల్లడించారు. ఇక కొన్నేళ్లుగా కమర్షియల్ సినిమా పాటలు అంటే ఇలానే ఉండాలని అర్ధం చెప్పిన ఎంఎం కీరవాణి వంటి దిగ్గజ స్వరకర్త ఆర్ఆర్ఆర్ వంటి మెమరబుల్ మూవీ కోసం ఆస్కార్ సహా జాతీయ అవార్డును గెలుచుకున్నారు, మీకు అభినందనలు సార్.. అంటూ వెల్లడించారు.

ఆర్‌ఆర్‌ఆర్ వంటి భారీ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కోసం పని చేసిన ప్రతి టెక్నీషియన్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జాతీయ అవార్డు పొందిన కాల భైరవ, శ్రీనివాస్ మోహన్, ప్రేమ్ రక్షిత్, కింగ్ సోలమన్‌లకు అభినందనలు అని రాసుకొచ్చారు. నేను ఎంతో ఆరాధించే మరియు గౌరవించే గీత రచయిత చంద్రబోస్ కు నా శుభాకాంక్షలు. అలాగే నా సోదరుడు, ఎనర్జిటిక్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ జాతీయ అవార్డును గెలుచుకోవడం నాకు చాలా సంతోషకరమైన విషయం అని అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











