Don't Miss!
- Sports ధోనీ ట్రేడ్‌మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాశనం చేయకండి:నటుడు చిన్నా
చిన్న సినిమాని ఎందుకు నాశనం చేస్తున్నారో అర్థం కావడం లేదు. గొప్ప టెక్నీషియన్లతో అత్యున్నత స్థాయి సాంకేతిక విలువలతో, మంచి నటులతో ఈ సినిమా తీశా. నేను కథని నమ్మా. ఇమేజ్‌ని నమ్ముకోలేదు. అయినా కూడా ఈ సినిమాని నిలబెట్టుకోలేక పోతే ఎందుకు సినిమా తీయడం? కమర్షియల్గానూ 'ఆ ఇంట్లో' డిజప్పాయింట్ చేయదనే ఇప్పటికీ నమ్ముతున్నా" అంటూ మీడియా వద్ద చిన్నా బాధపడ్డారు. నటుడుగా పేరున్న చిన్నా దర్శకుడిగా మారి ఆయన రూపొందించిన తొలి చిత్రం 'ఆ ఇంట్లో' ఇటీవల విడుదలైంది. డివైడ్ టాక్ తో సినిమా ముందుకు వెళ్తోంది. ఫరవాలేదు..యావరేజ్ అంటున్నా కలెక్షన్స్ మాత్రం గొప్పగా లేవు. దాంతో చిన్నా చాలా మానసికంగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.
అంతా ఆయన్ని 'చాలా గొప్పగా డైరెక్ట్ చేశావు. మేం ఇట్లాంటి సినిమాని చేయలేకపోయామే అని బాధపడుతున్నాం' అంటున్నారు.కానీ ఆయన మాత్రం డైరెక్టర్‌గా ఈ రోజున ఎంజాయ్ చేయలేక పోతున్నా. కారణం ఈ సినిమాకి నిర్మాతని కావడమే" అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
"తొమ్మిది నెలల శ్రమతో నేను రూపొందించిన 'ఆ ఇంట్లో' చిత్రానికి దర్శకుడిగా నాకు చాలా మంచి పేరు వచ్చింది. చిన్న సినిమాగా రిలీజై నాలుగో రోజుకి పెద్ద సినిమాగా తయారయ్యింది. నటుడిగా, నిర్మాతగా, కథకుడిగా, మాటల రచయితగా, స్క్రీన్‌ప్లే రచయితగా, కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా ఈ చిత్రానికి ఏడు బాధ్యతలు నిర్వర్తించా. ఒక్క పైసా ఎక్కువ కాకుండా అనుకున్న బడ్జెట్లోనే ఈ చిత్రాన్ని తీశా.
కానీ సినిమా తీశాక నిర్మాతగా చాలా బాధలు పడ్డా. 100 శాతం మంచి సినిమా తీశానని అందరూ అంటున్నారు.కానీ ఎందుకు ఆదరించటంలేదో తెలియటం లేదు అంటున్నారు. అయితే ఒక విషయం ఇక్కడ గుర్తించుకోవాలి..అరుంధతి రిలీజ్ రోజున పెద్ద హంగామా లేదు..సినిమాకి తగ్గ పబ్లిసిటీ లేదు..కానీ మార్నింగ్ షో పూర్తయ్యేసరికల్లా ఎక్కడ చూసినా అధ్బుతమనే టాకే కదా.