నా పేరు సూర్య దర్శకుడి వ్యాఖ్యలు.. ఆ జబ్బు ఎప్పటికి తగ్గ కూడదు, అందరికి అంటుకోవాలి!

Recommended Video

Director Vakkantham Vamsi Speech At Manam Saitam

చిత్రపరిశ్రమలో ఉన్న పేదవారిని ఆదుకునేందుకు నటుడు కాదంబరి కిరణ్ మనం సైతం అనే ప్రోగ్రాం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఒక్కొకరుగా చేయూత అందిస్తున్నారు. ఇటీవల ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని, నా పేరు సూర్య చిత్ర దర్శకుడు వక్కంతం వంశీ హాజరయ్యారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని కాదంబరి కిరణ్ చేస్తున్నారని వక్కంతం వంశి అన్నారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ ని వక్కంతం వంశి ప్రశంసలతో ముంచెత్తారు.

స్వార్థం కోసం అడగలేదు

స్వార్థం కోసం అడగలేదు


కాదంబరి కిరణ్ తనకు చాలా రోజులుగా పరిచయం అని దర్శకుడు వక్కంతం వంశి అన్నారు. ఈ మధ్య తనని చాలా సార్లు కలసినప్పటికీ తన చిత్రంలో వేషం ఇవ్వాలని అడగలేదని వక్కంతం వంశి తన స్వార్థం కోసం ఏమి అడగలేదు. కానీ నలుగురికి మంచి జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కావాలి కోరాడు అని వక్కంతం వంశి తెలిపాడు.

జబ్బుని పెంచుకుంటూ

జబ్బుని పెంచుకుంటూ

మనం సైతం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన కాదంబరి కిరణ్ పదిమందికి సాయపడడం అనే జబ్బు పెంచుకుంటూ పోతున్నాడని వక్కంతం వంశి అన్నారు. ఆ జబ్బు ఎప్పటికి తగ్గకూడదు. అందరికి అంటుకోవాలని కోరుకుంటున్నట్లు వక్కంతం వంశి తెలిపాడు.

లక్ష సాయం

లక్ష సాయం

మనం సైతం కార్యక్రమానికి తాను కూడా రూ లక్ష సాయం అందిస్తున్నట్లు వక్కంతం వంశి తెలిపారు. తాను ఈ సాయం చేయడానికి స్ఫూర్తి రామజోగయ్య శాస్త్రి అని అన్నారు.

నాని కూడా

నాని కూడా


నేచురల్ స్టార్ నాని కూడా ఈ కార్యక్రమానికి హాజరై సాయం అందించారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ ని అభినందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X