ఐదుగురు హీరోయిన్లతో....వంశీ కొత్త సినిమా

By Bojja Kumar

హైదరాబాద్ : సితార, అన్వేషణ, ఏప్రిల్ 1 విడుదల లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వంశీ....2010లో అల్లరి నరేష్ తో 'సరదాగా కాసేపు' చిత్రం తర్వాత సినిమాలేవీ చేయలేదు. 2013లో వంశీ తన 25వ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. జనవరి చివరి వారంలో ఈచిత్రం మొదలు కానుంది.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం వంశీ దర్వకత్వం వహించ బోయే ఈ కొత్త చిత్రంలో అంతా కొత్త వారినే తీసుకుంటున్నారని, ఇందులో ఒక హీరో, ఐదుగురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. పూర్ణా నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఎం.వి.రఘు సినిమాటోగ్రఫీ చేయబోతున్నారు.

1980-1990ల మధ్యలో సితార, అన్వేషణ, లేడీస్ టైలర్, ఏప్రిల్ ఒకటి లాంటి సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ టాప్ 5 దర్శకుల్లో ఒకరిగా వంశీ వెలుగొందారు. అప్పట్లో వంశీ... విశ్వనాథ్, బాపు, జంధ్యాల స్థాయి దర్శకుడిగా గుర్తింపు పొందారు. అయితే ఆ తర్వాత నుంచి వంశీ చిత్రాలకు ఆదరణ తగ్గింది. 2002లో వంశీ దర్శకత్వంలో వచ్చిన 'అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' చిత్రంలో వంశీ హిట్ కొట్టాడు.

అనంతరం ఆయన దర్శకత్వం వహించిన 'దొంగ రాముడు అండ్ పార్టీ', 'కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను', 'అనుమానాస్పదం', 'గోపి గోపిక గోదారి' చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. చివరగా 2010లో వంశీ దర్శకత్వం వహించిన 'సరదాగా కాసేపు' చిత్రం యావరేజ్ కామెడీ చిత్రంగా పేరు తెచ్చుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X