ఆ మూవీ ప్లాపే, థియేటర్లో కొట్టి బయటకు తోశారు, అదీ నా లవ్ స్టోరీ: వంశీ పైడిపల్లి

Recommended Video

Director Vamsi Paidipally Shares His Personal Life Incidents || Filmibeat Telugu

ఒకప్పుడు సాధారణ ప్రేక్షకుడిలా మహేష్ బాబు సినిమాలు చూసిన దర్శకుడు వంశీ పైడిపల్లి ఇపుడు అదే హీరోతో 'మహర్షి' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. తాజాగా 'అలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ దర్శకుడి నుంచి బయటి ప్రపంచానికి తెలియని ఆసక్తికర విషయాలు రాబట్టారు అలీ.

వంశీ పైడిపల్లి బ్యాగ్రౌండ్ ఇదే

వంశీ పైడిపల్లి బ్యాగ్రౌండ్ ఇదే

మా అమ్మానాన్నలది కరీంనగర్‌ జిల్లా జగిత్యాల సమీపంలోని బీమారం. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లో థియేటర్‌ కొన్న తర్వాత అక్కడే స్థిరపడ్డారు. థియేటర్ కొన్న నాలుగు నెలల తర్వాత నేను పెట్టానట. నా చదువు బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో సాగింది. సెలవులకు ఇంటికి వెళితే థియేటర్లోనే ఎక్కువ సయం గడిపేవాడినని వంశీ పైడిపల్లి గుర్తు చేసుకున్నారు.

అది ప్లాప్ సినిమానే

అది ప్లాప్ సినిమానే

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి సినిమాలపై పిచ్చితో అసిస్టెంట్‌ డైరెక్టర్ అయినా చాలు అనుకుని వచ్చా. ‘భద్ర' సినిమాకు పని చేస్తున్నపుడే దిల్ రాజుగారు కథ రాసుకో చేద్దాం అన్నారు. అపుడే ‘మున్నా' కథ రాశాను. రాజుగారి వల్ల 26 ఏళ్లకే ఈజీగా దర్శకుడిని అయ్యాను. ప్రభాస్, రాజుగారు నన్ను నమ్మి సినిమా చేశారు. అయితే నా తొలి సినిమా హిట్ కాలేదని వంశీ తెలిపారు.

నన్ను కొట్టి థియేటర్ నుంచి బయటు తోశారు

నన్ను కొట్టి థియేటర్ నుంచి బయటు తోశారు

నేను కాలేజీ రోజుల్లో థియేటర్లో దెబ్బలు తిన్నాను. నాకు మామూలుగా సినిమా చూడటం రాదు. ప్రతి సీనుకు అతిగా స్పందిస్తాను. అలా ఒకసారి థియేటర్లో గోల చేస్తుంటే నన్ను కొట్టి బయటకు పంపారు. ఇపుడు అదే థియేటర్లో ‘మహర్షి' ఆడుతుందని వంశీ తెలిపారు.

ఆమెతో అలా ప్రేమలో పడ్డాను

ఆమెతో అలా ప్రేమలో పడ్డాను

‘భద్ర' షూటింగ్‌ కోసం బెంగళూరు వెళ్లినపుడు డిజైనర్ శ్వేతా ద్వారా మాలిని పరిచయం అయింది. ఆ రోజు తన పుట్టిన రోజు కావడంతో విష్ చేశాను. అలా మా మధ్య ఏర్పడిన పరిచయం తనపై ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడేలా చేసింది. ముందు తాను అంగీకరించినట్లు అనిపించలేదు. కానీ తనకు పెళ్లి చూపులు జరుతున్న సమయంలో నాకు ఫోన్ చేసి నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తున్నట్లు చెప్పింది. 2007లో పెళ్లి చేసుకున్నామని వంశీ తెలిపారు.

‘ఊపిరి' అందుకే ఎన్టీఆర్ చేయలేదు

‘ఊపిరి' అందుకే ఎన్టీఆర్ చేయలేదు

‘ఊపిరి' సినిమా నాగార్జున, ఎన్టీఆర్ కాంబినేషన్లో అనుకున్నాం. కానీ ఎన్టీఆర్ అప్పటికే ఇతర సినిమాలకు కమిట్ అయ్యారు. వెయిట్ చేద్దామంటే నాగార్జునగారు కూడా ఇతర ప్రాజెక్టులు ఒప్పుకున్నారు. ఆ సమయంలో కార్తి మాకు బెస్ట్ ఆప్షన్ అనిపించిందని వంశీ తెలిపారు. ‘మహర్షి' తర్వాత విహారయాత్రకు వెళ్లాలనుకుంటున్నాను. వచ్చిన తర్వాత నా తర్వాతి ప్రాజెక్ట్ ప్రకటిస్తాని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X