twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా ఫీల్డ్‌కి రావడానికి కారణం అదే..: దర్శకుడు వంశీ

    By Srikanya
    |

    హైదరాబాద్ : సినిమాలు బాగా చూసేవాణ్ణి. కానీ, సినిమా ఫీల్డ్‌కి రావాలని మాత్రం ఏనాడూ అనుకోలేదు అంటూ వంశీ తను సినిమాల్లోకి రావటానికి వెనక ఉన్న కారణం వివరించారు. ఆయన తన గురువులు కె.విశ్వనాధ్,బాలచందర్ లను తలుచుకుంటూ..తను తొలిసారి మద్రాసు వచ్చిన రోజులను తలుచుకున్నారు.

    వంశీ మాటల్లోనే... నా 18వ ఏట నా కంటే పదేళ్ళు పెద్దదైన అమ్మాయిని ఇష్టపడ్డాను. తనూ నన్ను ఇష్టపడింది. ఓ రోజు నేను వేరే ఊరు వెళ్లి వచ్చేసరికి ఏదో జబ్బు చేసి ఆ అమ్మాయి చనిపోయింది. ఇక అక్కడ ఉండలేక ఎక్కడికైనా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. ఆ టైమ్‌లోనే ఒకాయన 'నీ టాలెంట్‌కి సినిమా ఫీల్డ్ కరెక్ట్' అని దారి చూపారు అన్నారు.

    ఇక అప్పటికే నేను 'మంచుపల్లకి', 'కర్మసాక్షి' నవలలు రాశా. వాటిని తీసుకుని దర్శకుడు విక్టరీ మధుసూదనరావు గారి దగ్గరకు వెళ్తే టెస్ట్ పెట్టారు. లూయిస్ గిల్‌బర్ట్ తీసిన 'ఫ్రెండ్స్' సినిమా మద్రాసు కేజినో థియేటర్‌లో ఆడుతోంది. దాన్ని పదిసార్లు చూసి వన్‌లైన్ ఆర్డర్ వేసుకురమ్మన్నారు. నేను ఒక్కసారి చూసి రాసి తీసుకువెళ్ళా. ఆయనకు నచ్చి'ఎదురీత' సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా తీసుకున్నారు. నా తొలి క్లాప్ ఎన్టీఆర్‌గారిపై కొట్టాను. ఆ తర్వాత ఏయన్నార్ 'విచిత్ర జీవితం'కు పని చేశా. ఇలా ఓ 10, 15 సినిమాలు చేశా. అసిస్టెంట్ డెరైక్టర్‌గా నా ఆఖరి సినిమా 'సీతాకోక చిలక' అన్నారు వంశీ.

    కె.విశ్వనాథ్, భారతీరాజా... ఇద్దరి దగ్గర పని చేసినా తనపై భారతీరాజా ప్రభావమే ఎక్కువ కనిపించటానికి కారణం చెప్తూ... నేనాయన్ని అంతగా ప్రేమించాను కాబట్టి. అయితే మొదట్లోనే ఆయన ముద్ర నాపై ఉండేది. తర్వాత తర్వాత నాకంటూ ఓ శైలి ఏర్పడింది అన్నారు.

    తను చిన్నప్పుడు చూసిన సినిమాలు గురించి చెప్తూ... టూరింగ్ టాకీస్‌లో మా అమ్మతో కలిసి 'అమరశిల్పి జక్కన' సెకండ్ షో చూశాను. ఆరోజు జోరువాన. తడుసుకుంటూనే వెళ్ళాం. అదీ నా జీవితంలో చూసిన తొలి సినిమా. ఆ తర్వాత 'తోబుట్టువులు' చూశాను. నేను ఎక్కువసార్లు చూసిన సినిమా 'మొనగాళ్ళకు మొనగాడు'. మోడరన్ థియేటర్స్ వారి సినిమా అది. రామచంద్రపురంలోని రాజగోపాల్ పిక్చర్ ప్యాలెస్‌లో చూశాను అన్నారు.

    English summary
    Director Vamsi remebers his earlier days. He says that his guru's are K.Viswanath and Bharathi Raja.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X