హీరోయిన్ ఆత్మ కథ రాస్తానంటున్న దర్శకుడు...
''ఓ ఆలోచన ఉంది. ఒప్పుకొంటే ఎవరైనా హీరోయిన్ ఆత్మకథ రాద్దామనుకొంటున్నా. అయితే ఆవిడ నేనడిగినదేదీ దాయకూడదు'' అన్నారు ప్రముఖ దర్శకుడు వంశీ. కథలు రాశారు... పాటలు రాశారు... ఇంకా ఏమైనా రాయాలనుకొంటున్నారా? అని మీడియా వారు ప్రశ్నిస్తే ఆయన అలా సమాధనమిచ్చారు. గోపి..గోపిక..గోదావరి హిట్టుతో మరింత ఉషారుతో అల్లరి నరేష్ హీరోగా చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు ఆయన చేస్తున్నారు.లేడీస్ టైలర్ చిత్రానికి రీమేక్ అని సమాచారం. ఇక అలాగే ఆయన రాసిన పసలపూడి కథలు చాలా ప్రాచుర్యం పొందాయి. వాటిని కూడా టీవీ సీరియల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ మధ్యన ఆయన 'అనుమానాస్పదం' చిత్రానికి రాసిన 'ప్రతి దినం నీ దర్శనం' పాట బాగా పాపులర్ అయింది.ఈ సందర్బంగానే మరో సంగతి చెప్పుకొచ్చారు...నేను రాసిన తొలిపాట.. ''సీతాకోకచిలుక కోసం 'స్తోత్రము చేయుదమూ' అనే క్రీస్తు ప్రార్థన గీతం నేను, పాలకొల్లు బాబూరావు కలిసి రాశాం. అయితే తెర మీద మా పేర్లు ఉండవు'' అన్నారు.ఇది ప్రక్కన పెడితే ఆయన ఆత్మకథ రాద్దామనుకుంటున్న హీరోయిన్ ఎవరో...


Click it and Unblock the Notifications











