సునీల్ సిక్స్ ప్యాక్ పై దర్శకుడు వీరభద్రం కామెంట్
''సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించాలని రెండేళ్ల నుంచి కష్టపడ్డారు సునీల్. సిక్స్‌ప్యాక్ గురించి తను ఎంత కష్టపడ్డాడో దాన్ని తెరపై చూపించేందుకూ నేను కూడా అంతే శ్రమించాను. చివరి పదిహేను నిమిషాలకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకొన్నాము''అన్నారు వీరభద్రమ్. పూలరంగడు ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే పూల రంగడు సక్సెస్ గురించి వివరిస్తూ...పూలరంగడు' సినిమాలోని ఏ ఒక్క సన్నివేశంలో కూడా ప్రేక్షకుడిని ఖాళీగా ఉంచలేదు. వినోదం, ఆసక్తి, ఉత్కంఠ... ఇలా ఏదో ఒక భావోద్వేగం పండేలా చూసుకొన్నాను. అదే ప్రేక్షకుడికి బాగా నచ్చింది. కథలో ఉన్న వినోదమే ఈ విజయానికి కారణమైంది. ప్రతి సన్నివేశాన్నీ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఒక దర్శకుడిగా నాకు దక్కిన చక్కటి విజయం ఈ చిత్రం అన్నారు. ఇక తాను త్వరలోనే ఒక పెద్ద హీరోతో సినిమా చేయబోతున్నట్లు తెలిపారు.
ఇక పూల రంగడు చిత్రం రిలీజ్ రోజు నుంచి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో సునీల్ చేసిన సిక్స్ ఫ్యాక్ ఫీట్ ఇనానమస్ గా అందరి ప్రశంసలూ అందుకుంటోంది.


Click it and Unblock the Notifications











