'బిందాస్' ఆఫర్ ఎలా వచ్చిందంటే...వీరూపోట్ల
రచయితగా కెరీర్‌ను మొదలుపెట్టి 'బిందాస్' తో దర్శకుడిగా మారిన వీరు పోట్ల. ఆయన 'బిందాస్' చిత్రం ఆఫర్ ఎలా వచ్చిందో చెప్పుకొచ్చారు. హాస్య నటుడు సునీల్ ద్వారా నాకు హీరో మనోజ్ పరిచయమయ్యారు. ఒక రోజు మనోజ్‌కు నేను కథ చెప్పటం జరిగింది. ఇంప్రెస్ అయిన మనోజ్ వెంటనే..నాకు నిర్మాత అనిల్‌సుంకరను పరిచయం చేసారు. ఆయన కూడా విని ఇంటిల్లిపాదీని అలరించే కథాంశం అని చేయటానికి ముందుకొచ్చారు. దాంతో..ఆలస్యం కాకుండా మా కలయికలో 'బిందాస్' చిత్రం ప్రారంభం అవ్వడం..విజయం సాధించటం అన్నీ చక చకా జరిగిపోయాయి అన్నారు.
అలాగే రచయితగా పనిచేస్తున్నప్పుడు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ దర్శకుణ్ని చేశాయంటూ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ చిత్రం తనకు ఆనందాన్ని కలగచేసిందని తొమ్మిది నెలలు తన బిడ్డను కష్టపడి ఇష్టపడి కడుపులో దాచుకున్న అమ్మ...ప్రసవం తర్వాత ఎంత ఆనందంగా, రిలాక్స్‌గా ఫీలవుతుందో..ఇప్పుడు నేను కూడా అదే అనుభూతిలో వున్నానని వివరించారు.వీరూ పోట్ల గతంలో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలకు కథను, సంతోషం,మనసంతా నువ్వే చిత్రానికి మూల కథను అందించారు.


Click it and Unblock the Notifications











