Dil Raju ను మామూలుగా ట్రోల్ చేయలేదుగా.. కస్టడీ డైరెక్టర్ వెంకట్ ప్రభు వైరల్ స్పీచ్ ఎలా సాగిందంటే?
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో తెలుగు తమిళంలో రూపొందిన చిత్రం కస్టడీ. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కింది. చిత్రానికి పవన్ కుమార్ సమర్పిస్తుండగా శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మే 12న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ..
డ్యాన్స్ ఇరుక్కు.. ఫైట్స్ ఇరుక్కు అంటూ: వారిసు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ.. విజయ్ సార్ చిత్రంలో ఏమీ ఉండాలో అవి ఉంటాయి. ఫ్యాన్స్ ఏమీ కోరుకొంటారో అవి ఉంటాయి. డ్యాన్స్ వేణుమా.. డ్యాన్స్ ఇరుక్కు.. ఫైట్ వేణుమా ఫైట్ ఇరుక్కు. విజయ్ సార్ బాడీ లాంగ్వేజ్ వేణుమా అది.. ఇరుక్కు, ఫైనల్లీ ఎమోషనల్ ఆల్సో ఇరుక్కు. ఇట్స్ హోల్ టైమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని దిల్ రాజు అన్నారు. ఆ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
యాక్షన్ వేణుమా యాక్షన్ ఉంది అంటూ: అందరికీ సారీ.. తెలుగులో నేను ఫ్లూయెంట్‌గా మాట్లాడలేను. కస్టడీ సినిమాలో నాగచైతన్య గారు కానిస్టేబుల్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో స్టైయిల్ వేణుమా.. స్టైల్ ఉంది.. యాక్షన్ వేణుమా.. యాక్షన్ ఉంది.. ఫెర్ఫార్మెన్స్ వేణుమా.. ఫెర్ఫార్మెన్స్ ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్ వేణుమా.. సెంటిమెంట్ ఉంది. ఎల్లా వేణుమా అన్ని ఉన్నాయి. మాస్ వేణుమా మాస్ ఉంది అని వెంకట్ ప్రభు దిల్ రాజును అనుకరించారు. వెంకట్ ప్రభు మాట్లాడుతున్నంత సేపు చైతూ నవ్వుతూనే ఉండిపోయారు.

భారీ బడ్జెట్‌తో నా ఫస్ట్ సినిమా: ఇది నా తొలి తెలుగు సినిమా. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రం. ఇలాంటి చిత్రాన్ని ఇచ్చిన పవన్, శ్రీనివాస్ చిట్టూరి గారికి బిగ్ థ్యాంక్స్. కథ చెప్పిన వెంటనే ఆలస్యం చేయకుండా ఒకే చెప్పిన చైతుకు నా థ్యాంక్స్. ఈ సినిమా క్రెడిట్ అంతా చైతూకే దక్కుతుంది. నన్ను, నా కథను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ అని వెంకట్ ప్రభు అన్నారు.

ప్రియమణి మేడమ్‌కు థ్యాంక్స్: కృతిశెట్టి వండర్‌ఫుల్ యాక్టర్. నేను చెప్పినట్టుగా యాక్టింగ్ చేసి మంచి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. కృతికి మంచి లైఫ్ ఉంది. తమిళం మాట్లాడటం నాకు చాలా ఈజీ అయిపోయింది. ఇక ప్రియమణి మేడమ్‌ను కన్విన్స్ చేయడం చాలా కష్టమైంది. చివరకు ఈ పాత్రను చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రియమణికి అందుకు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను అని వెంకట్ ప్రభు అన్నారు.

అరవింద్ స్వామి పాత్ర ఎలా ఉంటుందంటే?: కస్టడీ సినిమాలో అరవింద్ స్వామి రాజు అనే పాత్రలో నటించారు. ఆయన పాత్ర చాలా బాగుంటుంది. నాగచైతన్య శివ పాత్ర, రాజు పాత్ర మధ్య మంచి కెమిస్ట్రీ ఉంటుంది. శరత్ కుమార్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్‌కు, నా యూనిట్‌కు థ్యాంక్స్. అబ్బూరి రవికి థ్యాంక్స్. ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికి నా థ్యాంక్స్ అని వెంకట్ ప్రభు చెప్పారు.


Click it and Unblock the Notifications











