ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు వెంకటేష్ మహా అబ్బ.. సలార్‌పై అలా ట్వీట్.. ట్రోల్స్ భరించలేక ట్విట్టర్ అకౌంట్ డిలీట్
C/o కంచెరపాలెం మూవీతో సినీ విమర్శకులే కాకుండా సాధారణ ప్రేక్షకుల ప్రశంసలందుకొన్న దర్శకుడు వెంకటేష్ మహా మరోసారి వివాదంలో చిక్కుకొన్నాడు. గతంలో కేజీఎఫ్ సినిమాపై నోరుపారేసుకొన్న ఆయన ఈసారి ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు వ్యతిరేకంగా పోస్టు పెట్టడం రెబల్‌స్టార్ అభిమానుల కన్నెర్రకు గురిచేసింది. ఈసారి కూడా ప్రశాంత్ నీల్ సినిమా వస్తున్న నేపథ్యంలో డంకీ హిట్ కావాలనే ఉద్దేశంతో చేసిన ట్వీట్‌పై ప్రభాస్ అభిమానులు కన్నెర్ర జేయడంతో ఆయన తన ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేసుకొన్నాడు. ఆ ట్వీట్ వివాదంలోకి వెళితే..
ఇండియాలో అత్యంత ఆదరణ ఉన్న టాప్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని, బాలీవుడ్ బాద్షా నటించిన డంకీ డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ అవుతున్నది. అలాగే కేజీఎఫ్2 బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్‌లో సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడటం బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరంగా మారింది.
Recommended Video


సలార్, డంకీ సినిమాల మధ్య పోటీ ఉన్న సమయంలో దర్శకుడు వెంకటేష్ మహా చేసిన ట్వీట్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఆయన ట్వీట్ చేస్తూ.. డంకీ సినిమా సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. తొలి రోజు మొదటి ఆట చూడాలని వేచి చూస్తున్నాను. నా అభిమాన నటుడు షారుక్ ఖాన్, నా అభిమాన దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి కాంబినేషన్‌లో వస్తుండటం ఆనందంగా ఉంది అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అయితే డంకీ సినిమా సెన్సార్ బోర్డు స్క్రీన్ సమయంలో చూసిన అధికారులు లేని నిలబడి చప్పట్లు కొట్టారనే విషయం నాకు మరింత ఆనందం కలుగజేసింది. ఇదే నిజమైతే..సినీ ప్రేక్షకులకు ఈ సినిమా భావోద్వేగాలను పంచుతుందని అనుకొంటున్నాను అని వెంకటేష్ మహా ట్వీట్ చేశారు. ఇలా ట్వీట్ చేయడం ప్రభాస్ అభిమానులకు కోపం తెప్పించింది. సలార్ సినిమా గురించి రాయకుండా డంకీ సినిమా గురించి రాస్తావా అని వెంకటేష్‌ను దారుణంగా ట్రోల్ చేశారు.
దాంతో ప్రభాస్ అభిమానులకు వెంకటేష్ మహా సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. ఓకే గయ్స్. మీరు పొరపాటుపడినట్టు ఉన్నారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి వస్తుండటం వల్ల మీరు తప్పుగా అర్ధం చేసుకొని ఉంటారు. డంకీ సినిమాపై ట్వీట్ చేయడమనే విషయంలో నా మనసులో చెడు ఉద్దేశం లేదు. నా ట్వీట్ వేసిన తర్వాత సలార్ ట్రైలర్ వచ్చిందనే విషయం నాకు తెలియదు అని ఆయన అన్నారు.
అయినా ప్రభాస్ అభిమానులు వెంకటేష్ మహాపై ఫైర్ అవుతూనే ఉన్నారు. దాంతో నేను కూడా ప్రభాస్ ఫ్యాన్‌ను. ఆయన మొదటి సినిమా నుంచి అభిమానిస్తున్నాను. ఆయనతో పనిచేయాలనే కోరికతో ఉన్నాను. ఇప్పుడే సలార్ ట్రైలర్ చూశాను. ఈ ట్రైలర్ అద్బుతంగా ఉంది. మీరు తప్పుగా అర్ధం చేసుకోవద్దు అని వెంకటేష్ అన్నాడు. అయినా ట్రోల్స్ ఆగకపోవడంతో తన ట్విటర్ అకౌంట్ డిలీట్ చేసుకొన్నారు.


Click it and Unblock the Notifications











