కిందా పైనా ఊపు.. మా నితిన్ అన్న తోపు.. దీనికో అర్థం ఉంది: భీష్మ డైరెక్టర్
భీష్మ సినిమాతో గత ఏడాది బాక్సాఫీస్ హిట్ అందుకున్న నితిన్ ఈ సారి మరో డిఫరెంట్ సినిమాతో ఆకట్టుకోవడానికి రెడీ అయ్యాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆదివారం సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. వేడుకలో భీష్మ దర్శకుడు వెంకీ కుడుముల తన స్పీచ్ తో అదరగొట్టేసాడు.
Recommended Video

వేడుకలో వరుణ్ తేజ్
చెక్ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఆ అంచనాల డోస్ ను మరింత పెంచేశారు. వేడుకకు హీరో వరుణ్ తేజ్, దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అలాగే క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని, భీష్మ దర్శకుడు వెంకీ కుడుముల కూడా వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

ఈ సినిమా నాకు కూడా స్పెషల్
భీష్మ దర్శకుడు వెంకీ మాట్లాడుతూ.. ఈ రోజుతో మా భీష్మ రిలీజై ఏడాది అయ్యింది. ఇదే రోజు మళ్ళీ నితిన్ అన్న మరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండటం హ్యాపీగా ఉంది. ఈ సినిమా నాకు కూడా స్పెషల్. ఎందుకంటే ఒకటి చంద్రశేఖర్ యేలేటి గారు, రెండు భవ్య క్రియేషన్స్. మూడు నా డార్లింగ్ నితిన్ అన్న.. మాట్లాడారు.

ఒక్కడున్నాడు హాలివుడ్ లో..
చంద్రశేఖర్ యేలేటి గురించి మాట్లాడుతూ.. నాకు ఇష్టమైన దర్శకుల్లో ఆయన ఒకరు. బయట ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో. 2007లో ఒక్కడున్నాడు సినిమా తీస్తే.. 2012లో మెల్ గిబ్సన్ (get the gringo) హాలీవుడ్ సినిమాను అదే పాయింట్ తో తెరకెక్కించారు. అలాంటి కథను మీలాంటి దర్శకుడు ముందే తీసేశారు. నాకు గర్వంగా అనిపించింది.. అని వెంకీ తెలిపారు.

కిందా పైనా ఊపు మా నితిన్ అన్న తోపు.
ఇక చివరగా నితిన్ గురించి మాట్లాడుతూ.. కిందా పైనా ఊపు మా నితిన్ అన్న తోపు. ఇది నేను సరదాగా చెప్పడం లేదు. నా మనసులో ఉన్నదే. ఎందుకంటే నాకు ఆయన ఎప్పుడూ తోపే. ఎవరైనా మన లైఫ్ లో మనల్ని నమ్మి మనకు సపోర్ట్ చేస్తే ఎల్లప్పుడు తోపే. ఇక టైగర్ కు టైమొచ్చింది అన్నట్లు 2020 నుంచి నితిన్ అన్న టైమ్ స్టార్ట్ అయ్యింది. హిట్టు కొట్టారు. కోవిడ్ టైమ్ లోనే పెళ్లితో పాటు అన్ని సెలబ్రేషన్స్ హ్యాపీగా చేసుకున్నారు. అప్పుడు కోవిడ్ కాదు కదా కోల్డ్ కూడా రాలేదు. అందుకే నితిన్ అన్న టైమొచ్చింది.. అని వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











