బలగం కథ ఎవరిదీ కాదు.. చిల్లర పబ్లిసిటీ కోసమే.. వివాదంపై వేణు రియాక్షన్

జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది లైమ్ లైట్ లోకి వచ్చారు. అలాంటి వారిలో వేణు ఒకరు. జబర్దస్త్ కంటే ముందుగానే పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ప్రభాస్ మున్నా చిత్రంలో టిల్లుగా నటించి టిల్లు వేణుగా గుర్తింపు పొందాడు. అతిథి వంటి పలు చిత్రాల్లో నటించిన వెణు అనంతరం బుల్లితెరపైనే ఎక్కువగా సందడి చేశాడు. ఇక ఇటీవల రచయిత, దర్శకుడిగా మారి బలగం అనే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కథ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. రచయిత, జర్నలిస్ట్ గడ్డం సతీష్ బలగం కథ తనదని మీడియా వేదికగా తెలిపారు. ఈ వివాదంపై తాజాగా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు వెణు ఎల్దండి.

మార్చి 3న రిలీజై..

మార్చి 3న రిలీజై..


జబర్దస్త్ కమెడియన్ టిల్లు వేణు దర్శకుడిగా మారిన చిత్రమే బలగం (Balagam Movie). కమెడియన్ ప్రియదర్శి మరోసారి మెయిన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో మసూద ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్ హీరోయిన్ గా చేసింది. టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ బలగం చిత్రాన్ని నిర్మించింది. ఇటీవల అంటే మార్చి 3న విడుదలైన బలగం సినిమాకు మంచి రెస్పాన్స్ తోపాటు విమర్శలుకు సైతం ప్రశంసిస్తున్నారు.

నాలుగు జోక్స్ యాడ్ చేసి..

నాలుగు జోక్స్ యాడ్ చేసి..

అయితే బలగం సినిమా కథ తనదే అని ఇటీవల రచయిత, జర్నలిస్ట్ గడ్డ సతీష్ ఆరోపించిన విషయం తెలిసిందే. 2011లో తాను రాసిన పచ్చికి' కథను బలగం పేరుతో చిన్న మార్పులు చేసి తెరకెక్కించారని ఆయన అన్నారు. అంతేకాకుండా 90 శాతం కథ తనదేనని, కేవలం 10 శాతం మార్చారని, మూడు పాటలు, నాలుగు జోక్స్ యాడ్ చేసుకుని వాళ్ల పేర్లు వేసుకున్నారని, దిల్ రాజు ఇంటికి పిలిపించుకుని ఆ కథ వేణుకి ఎవరో చెప్పారని సతీష్ ఆరోపించారు.

 అంతా కలిపితే 100కి పైగా ఉంటాం..

అంతా కలిపితే 100కి పైగా ఉంటాం..

తాజాగా బలగం కథ వివాదంపై డైరెక్టర్ వేణు ప్రెస్ మీట్ నిర్వహించారు. "మాది చాలా పెద్ద కుటుంబం. మా నాన్నతో కలిపి ఆరుగురు సంతానం. ముగ్గురు మేనత్తలు, ముగ్గురు పెద్దమ్మలు, ముగ్గురు మేనమామలు. మా కుటుంబం అంతా కలిపితే 100కి పైగానే ఉంటాం. తెలంగాణలో పెళ్లైనా, చావైనా పండగే. మా నాన్న గారు చనిపోయినప్పుడు ఈ వంద మంది వచ్చారు. చేదు నోరు అనే కాన్సెప్ట్ తెలంగాణలో ఉంటుంది. బాధల్లో ఉన్నోళ్లకు ఇంత మందు తాగిపించి వారి బాధను పంచుకుంటామనేది కాన్సెప్ట్. ఇది తెలంగాణ సంస్కృతిలో భాగం" అని వేణు తెలిపారు.

 ఇదొక గొప్ప విషయం..

ఇదొక గొప్ప విషయం..


"నాకప్పుడు 18-19 ఏళ్లుంటాయి. అవన్నీ చూసి నాకొక కొత్త ప్రపంచం కనిపించింది. చావులో ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయా అనిపించింది. అప్పటి నుంచి నా మైండ్ లో వందల సిట్యువేషన్స్ ఇరుక్కుని ఉండిపోయాయి. నా రెండో పెద్ద నాన్న చనిపోయిన 15 రోజులకే పెద్దమ్మ చనిపోయింది. నేను అప్పుడు సినిమాలతో బిజీగా ఉండి వెళ్లలేకపోయాను. తెలంగాణలో బుడగ జంగమలు మన పెద్దలు చనిపోయినప్పుడు పాట పాడుతుంటారు. మా పెద్దనాన్న, పెద్దమ్మ చనిపోయారని చెప్పి వాళ్లతో పాడించుకున్నారు. ఓ రకమైన ఆనంద బాష్పాలను కార్చారు. ఈ విషయం నాకు తెలిసింది. ఇదొక గొప్ప విషయం. దీన్ని నేను చెప్పాలనుకున్నాను" అని వేణు చెప్పుకొచ్చారు.

రీసెర్చ్ చేసి రూపొందించాను..

రీసెర్చ్ చేసి రూపొందించాను..

"కాకులు ముట్టటం అనేది నేనేమి కొత్తగా చెప్పలేదు. ఇది మన సాంప్రదాయం. ఇది తెలుగు వాళ్ల సాంప్రదాయం. ఇది అందరికీ తెలిసిందే. జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ కి ఈ పాయింట్ చెప్పగానే బాగుంది అన్నాడు. ఇద్దరం కలిసి నాగారం, జగిత్యాల ఇలా పది ఊళ్లు తిరిగి కథమై రీసెర్చ్ చేశాం. నిజం చెప్పాలంటే ఇది కథ కాదు. మన తెలుగు జీవితాల్లో జరిగే మూమెంట్స్. ఇలాంటి కథను నేను గొప్పగా చెప్పాలనుకున్నప్పుడు మైండ్ డీవియేట్ కాకుడదని 2018 నుంచి నేను అన్ని పక్కన పెట్టి రీసెర్చ్ చేసి కథను రూపొందించాను. క్లైమాక్స్ కోసం అయితే మూడు నెలలు కష్టపడ్డాను. 15 మంది బుడగ జంగాల వారిని కలిసి.. వారితోనే పాటలు పాడించుకున్నాను" అని వేణు పేర్కొన్నారు.

 రెండు పేజీలకు, వంద పేజీలకు..

రెండు పేజీలకు, వంద పేజీలకు..


"సతీష్ గారని వచ్చి బలగం తన కథ అంటున్నారు. ఆయనెవరో నాకు తెలియదు. ఇది తెలంగాణ సాంప్రదాయం ఇది చరిత్ర మనకు ఇచ్చింది. ఎవరి సొత్తు కాదు. పెళ్లిలో మంగళసూత్రం కట్టడం, ఊరేగింపు, అప్పగింతలు ఇవన్నీ ఓ సాంప్రదాయం. అలాంటి వాటని నాదని అంటే ఎలా. నా సినిమా కథను, సతీష్ గారి కథను చదివి మాట్లాడండి. రెండు పేజీల కథకు, వంద పేజీల కథకు ఉన్న తేడా ఏంటో తెలుస్తుంది. రైటర్ అసోసియేషన్ కు వెళ్లి మాట్లాడండి. వాళ్లు ఏది చెబితే అది స్వీకరిస్తాను. చిల్లర పబ్లిసిటీ కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదు" అని వేణు అన్నారు.

 చిల్లర వ్యక్తులు చేసే డ్రామా..

చిల్లర వ్యక్తులు చేసే డ్రామా..

"తెలంగాణ సంస్కృతిని ఇంత బాగా చూపిస్తే.. దిల్ రాజు గారు ఈ సినిమాను టేకప్ చేయకపోతే ఈ సినిమా గురించి తెలిసేదా. నాకు దిల్ రాజు గారు అవకాశం ఇచ్చారు. ఈ కథ రాసింది నేను. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాతో మాట్లాడండి. దిల్ రాజు గారు నిర్మాత. ఆయనతో ఎందుకు. అలాంటి పెద్ద వ్యక్తిని అబాసు పాలు చేయడానికి, ఆయన బొమ్మ పెట్టుకుంటే వ్యూస్ వస్తాయని చిల్లర వ్యక్తులు చేసే డ్రామా ఇది. ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి. నేను పచ్చికి కథ చదివాను. ఆయన కథలో పర్యావరణం అనే పాయింట్ ను టచ్ చేశారు. దానికి దీనికి సంబంధం లేదు" అని వేణు చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X