Vakeel Saab 2: పవన్ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్.. డైరెక్టర్ సంచలన ప్రకటన.. స్టోరీ ఎలా ఉంటుందంటే!

సుదీర్ఘ కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా హీరోగా వెలుగొందుతూ.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ ముందుకు సాగుతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అలాంటిది రాజకీయాల కోసం చాలా కాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ మధ్య 'వకీల్ సాబ్' అనే సినిమాతో పవన్ కల్యాణ్ అదిరిపోయే రీఎంట్రీని ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

'వకీల్ సాబ్'గా పవన్ రీఎంట్రీ: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. టాలెంటెడ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ రూపొందించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలు చేశారు. థమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం బాలీవుడ్ 'పింక్'కు రీమేక్‌గా రూపొందింది.

Director Venu Sriram Clarity on Vakeel Saab Movie Sequel

అన్ని కోట్లతో పవన్ అరాచకంగా: విడుదలకు ముందే అందరి దృష్టినీ ఆకర్షించిన 'వకీల్ సాబ్' మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 86.36 కోట్లు షేర్, రూ. 138.20 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. దీంతో ఎన్నో రికార్డులు కూడా నమోదు అయ్యాయి.

వాటిలో కూడా భారీ రెస్పాన్స్‌తో: థియేటర్లలో 'వకీల్ సాబ్' మూవీ భారీ ప్రభావాన్ని చూపించిదన్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో ఓటీటీలోనూ ఈ మూవీ అదే దూకుడును ప్రదర్శించింది. ఫలితంగా స్ట్రీమింగ్ చేసిన ఓటీటీలో రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కాయి. తద్వారా ఈ చిత్రం ఎన్నో అరుదైన ఘనతలను కూడా సొంతం చేసుకుంది. అలాగే, బుల్లితెరపైనా ఇది సత్తాను చాటుకుంది.

Director Venu Sriram Clarity on Vakeel Saab Movie Sequel

ఆ జోష్‌లోనే వరుసగా మూవీలు: రీఎంట్రీ ఇచ్చిన 'వకీల్ సాబ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్పందన రావడంతో పవన్ కల్యాణ్‌లో జోష్ రెట్టింపు అయిపోయింది. దీంతో ఆ వెంటనే ఈ స్టార్ హీరో 'భీమ్లా నాయక్' అంటూ వచ్చాడు. ఇక, ఇప్పుడేమో 'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'వినోదయం సీతం' రీమేక్, 'OG' వంటి చిత్రాలు చేస్తోన్నాడు. అలాగే, మరికొన్నింటిని లైన్‌లో పెట్టేశాడు.

వకీల్ సాబ్ సీక్వెల్ ప్లాన్ అంటూ: భారీ అంచనాలతో వచ్చి బంపర్ హిట్ కొట్టిన 'వకీల్ సాబ్' మూవీకి సీక్వెల్‌ రాబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా ఇప్పటి వరకూ కొత్త సినిమాను పట్టాలెక్కించలేదు. దీంతో ఆయన ఇదే స్టోరీ వర్క్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఫలితంగా 'వకీల్ సాబ్ 2' అనే హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Director Venu Sriram Clarity on Vakeel Saab Movie Sequel

సీక్వెల్‌పై వేణు శ్రీరామ్ ప్రకటన: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' మూవీ ఏప్రిల్ 9వ తేదీకి రెండు సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ వేణు శ్రీరామ్ ట్విట్టర్‌ ద్వారా ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా 'వకీల్ సాబ్' మూవీ సీక్వెల్‌ కోసం కథను రెడీ చేస్తున్నట్లు ప్రకటించాడు. అంటే త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు వెల్లడించాడు.

ఇంతకీ అతడేం చెప్పాడంటే..: ట్విట్టర్‌లో వేణు శ్రీరామ్.. 'గతంలో ప్రకటించిన ఐకాన్ మూవీ ఆగిపోయింది. ఇప్పుడు నేను మూడు స్క్రిప్టులకు పని చేస్తున్నా. అందులో వకీల్ సాబ్ సీక్వెల్ ఒకటి. ఇది మొదటి పార్టు కంటే హైలైట్‌గా ఉండబోతుంది. ఇందులో పవన్ గారి ఎలివేషన్స్ మరింత హై రేంజ్‌లో ఉంటాయి. త్వరలోనే ఆయన చర్చిస్తాను. ఆ తర్వాత అన్ని విషయాలు చెప్తాను' అంటూ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X