దర్శకుడు వేణు ఊడుగులకు మాతృవియోగం.. మరోసారి వెంటాడిన విషాదం
సినీ దర్శకుడు, వేణు ఊడుగుల కుటుంబంలో విషాదం సంభవించింది. వేణు మాతృమూర్తి అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం (ఫిబ్రవరి 27న) హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆమె పార్ధీవ దేహాన్ని బుధవారం మధ్యాహ్నం వరంగల్‌కు తరలించారు. గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.
సినీ రచయితగా చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న వేణు ఊడుగుల నీది నాది ఒకే కథ చిత్రంతో సినీ దర్శకుడిగా మారారు. ఈ సినిమా రిలీజ్ కొద్ది రోజుల ముందు ఆయన తండ్రి మరణించడం విషాదంలో మునిగిపోయారు. తాజాగా తల్లిని కూడా మరణించడం మరోసారి దుఖంలో మునిగారు. విషాదానికి గురైన వేణు ఊడుగులకు పలువురు సినీ ప్రముఖులు, పాత్రికేయులు సంతాపం వ్యక్తం చేశారు.

నీది నాది ఒకే కథ చిత్రం తర్వాత వేణు ఊడుగుల ప్రస్తుతం విరాట పర్వం అనే చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. సాయిపల్లవి, రానా దగ్గుబాటి జంటగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఇలాంటి శుభ సమయంలో వేణును విషాదం వెంటాడటంపై స్నేహితులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ విషాద సమయంలో వేణుకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని, తన తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











