Don't Miss!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్‌పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- News బీజేపీకి అనపర్తి సీటు కేటాయింపు వెనుక వైసీపీ..!?
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
నాందిలో నరేష్ న్యూడ్ సీన్.. అండర్ వేర్ కూడా లేదు.. అలా చేయడానికి కారణమిదే: దర్శకుడు విజయ్
మొత్తానికి అల్లరి నరేష్ బాక్సాఫీస్ వద్ద ఒక బలమైన హిట్ కొట్టాడు. చాలా కాలం తరువాత వచ్చిన ఈ సక్సెస్ తో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అయితే అల్లరి నరేష్ అంటే ఒకప్పుడు వరుసగా కామెడీ సినిమాలతో నిర్మాతలకు పెట్టిన పెట్టుబడికి మినిమమ్ లాభాలను తీసుకొచ్చేవాడు. అందుకే అప్పట్లో నిర్మాతలు ఈ హీరోతో వరుసగా సినిమాలు తీసేవారు. ఇక నరేష్ తో మంచి ఎమోషనల్ కథలు తెరకెక్కిస్తే కూడా బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవుతుందని గమ్యం సినిమాతోనే క్రిష్ ఎప్పుడో రుజువు చేశాడు. ఇక నాంది సినిమాతో అది మరోసారి నిజమయ్యింది. ఇక సినిమాలో న్యూడ్ సీన్ పై దర్శకుడు విజయ్ ఒక క్లారిటీ ఇచ్చాడు.
మంచి ఓపెనింగ్స్ ను అందుకున్న నాంది
సంక్రాంతి అనంతరం బంగారు బుల్లోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నరేష్ మరో డిజాస్టర్ అనుకున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ గా కామెడీ పాత్రలు చేయడం కూడా కరెక్ట్ కాదని భావించిన నరేష్ కొత్త దారిలో అడుగులు వేయడానికి డిసైడ్ అయ్యాడు. ఇక ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన నాంది ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది.
రిలీజ్ కు ముందే పాజిటివ్ టాక్
గత ఏడాది నాంది సినిమా టీజర్ ను ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చిన నరేష్ రిలీజ్ కు ముందే ఒక డిఫరెంట్ హిట్ కొట్టేలా ఉన్నాడని పాజిటివ్ టాక్ అందుకున్నాడు. నేరం చేశారో.. చేయలేదో తెలియని ఖైదీలు జైళ్లలోనే ఏళ్లతరబడి శిక్ష అనుభవిస్తున్నారనే కొత్త పాయింట్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేసింది. ఇక సినిమాలో నరేష్ మొదటిసారి న్యూడ్ గా నటించిన విషయం తెలిసిందే.
న్యూడ్ సీన్.. నిజమే..
బట్టలు లేకుండా నరేష్ ఎందుకు నటించారు అనే విషయంపై కూడా దర్శకుడు విజయ్ కనకమేడల ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. మొదట ఆ సీన్ నిజం కాదని బ్లర్ చేశారని టాక్ వచ్చింది. ఇక దర్శకుడు ఇచ్చిన క్లారిటీతో నిజంగానే ఆ సీన్ లో బట్టలు లేకుండా నటించినట్లు అర్ధమయ్యింది.
అండర్ వేర్ కూడా తీసేయ్యలా?
దర్శకుడు విజయ్ మాట్లాడుతూ.. మొదట సినిమా కథ చెప్పినప్పుడు షర్ట్ విప్పేస్తే సరిపోతుందని సీన్ గురించి చెప్పాము. ఆ తరువాత సీన్ చేసే సమయంలో నిజంగా ఆ సీన్ రియాలిటీగా ఉంటేనే బావుంటుందని చెప్పాము. అయితే ప్యాంట్ కూడా విప్పేస్తే సరిపోతుందా అని నరేష్ మాతో అన్నారు. నేను మళ్ళీ అలా చూడగానే.. ఏంటీ అండర్ వేర్ కూడా తీసేయ్యలా అని అన్నారు. ఇక నేను అవునని చెప్పాను.. అంటూ విజయ్ తెలిపాడు
ఆ సీన్ కనెక్ట్ అవ్వాలి అంటే..
అండర్ వేర్ తీసేయ్యకుండా బ్లర్ చేసి చూపిద్దామని నరేష్ చెప్పినప్పుడు.. అది అంత కరెక్ట్ గా రాదని అండర్ వేర్ తీస్తేనే సీన్ రియాలిటీగా అనిపిస్తుందని చెప్పగానే ఆయన పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే ఏ తప్పు చేయని వాడు పాపం ఇలాంటి ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేస్తున్నాడు అనే పాయింట్ ఆడియెన్స్ కు కనెక్ట్ అవ్వాలి అంటే ఈ సీన్ చాలా ముఖ్యం.. అందుకే నరేష్ ఆ సీన్ చేయడానికి ఒప్పుకున్నారు.. అని విజయ్ వివరణ ఇచ్చాడు.