వరుణ్ తేజ్ యాక్సిడెంట్ వల్లే ఆ సినిమా ఆగిపోయింది
సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఒక కథ ఎంత మంది హీరోల చుట్టూ తిరుగుతుందో చెప్పలేము. షూటింగ్ మొదలుపెట్టి ఆగిపోయిన కథలు కూడా మరో హీరో వద్దకు వెళ్లిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే గుండెజారి గల్లంతయ్యిందే డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా కెరీర్ లో కూడా అలాంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నట్లు చెప్పాడు.
రాజ్ తరుణ్ తో ఒరేయ్ బుజ్జిగా అనే సినిమా తీసిన విజయ్ కుమార్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని చెప్పాడు. ఆయన మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ తో ఆల్ మోస్ట్ కథ సెట్టయిన తరుణంలో సినిమా ఆగిపోయింది. వరుణ్ తేజ్ తో పాటు నాగబాబు గారికి కూడా ఆ కథ బాగా నచ్చింది. కానీ అప్పుడే వరుణ్ తేజ్ కి ఒక యాక్సిడెంట్ అయ్యి కాలికి గాయం అయ్యింది.

అప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. వరుణ్ కూడా రెగ్యులర్ లవ్ స్టోరీలు ఎక్కువవుతున్నాయని ఆలోచించి తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అంతే గాని నా కథ వలన ఆయన రిజెక్ట్ చేయలేదు. అలాగే మరో ముగ్గురు హీరోలతో కూడా ఇలానే క్యాన్సిల్ అయ్యాయి. ఈ రోజుల్లో షూటింగ్ మొదలయ్యే వరకు సినిమా తెరపైకి వస్తుందనే నమ్మకం ఉండదు. భవిష్యత్తులో వరుణ్ తేజ్ తో పాటు ఆ ముగ్గురి హీరోలతో కూడా తప్పకుండా సినిమాలు చేస్తాను.. అని విజయ్ కుమార్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











