నాగ చైతన్యతో హారర్ మూవీ సీక్వెల్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
యువ హీరో నాగ చైతన్య త్వరలో ఒక హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కొన్ని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా కాస్త కొత్తగా ట్రై చేయాలని అక్కినేని హీరో ప్రయోగాలు చేయడానికి సరికొత్త కథలైతే వింటున్నాడు. మజిలీ సినిమా సక్సెస్ కావడంతో అదే తరహాలో విజయాల్ని అందుకోవాలని ప్లాన్ చేసుకున్న చైతూకి వెంకీమామ అనుకున్నంతగా సక్సెస్ ఇవ్వలేకపోయింది.
ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాతో సిద్దమైన విషయం తెలిసిందే. ఆ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అదే విధంగా పరశురామ్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ ఆ సినిమా రావడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే పరశురామ్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా చేయనున్నాడు. అయితే ఈ గ్యాప్ లో నాగ చైతన్య మనం దర్శకుడు విక్రమ్ కుమార్ తో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఆ సినిమా విక్రమ్ మొదటి సినిమా 13Bకి సీక్వెల్ అనే టాక్ కూడా వచ్చింది. హారర్ కాన్సెప్ట్ లో రానుందని రూమర్స్ రావడంతో సోషల్ మీడియాలో చాలా రకాల రూమర్స్ వచ్చాయి. ఇక ఎట్టకేలకు దర్శకుడు విక్రమ్ ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చాడు. నాగ చైతన్యతో చేయబోయే సినిమా హారర్ కాన్సెప్ట్ కాదని ఆ సినిమా ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని విక్రమ్ వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











