»   » నా సినిమా నాకే నచ్చలేదు: సూర్య ‘24’ డైరెక్టర్ విక్రమ్

నా సినిమా నాకే నచ్చలేదు: సూర్య ‘24’ డైరెక్టర్ విక్రమ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇష్క్, మనం లాంటి విజయవంతమైన చిత్రాలు అందించిన దర్శకుడు విక్రమ్ కుమార్.. ప్రస్తుతం సూర్యతో '24' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో విడుదలవుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల ఓ సందర్భంలో విక్రమ్ తన కెరీర్ ఆరంభంలో చేసిన ఓ సినిమా గురించి గుర్తు చేసుకున్నారు.

తెలుగు చిత్రం 'ఇష్టం'తో దర్శకుడిగా పరిచయమైన విక్రమ్ ఆ తర్వాత 2003లో తమిళంలో 'అలై' అనే సినిమా చేసారు. శింబు-త్రిష హీరో హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం అప్పట్లో అట్టర్ ప్లాప్. ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుతూ...తాను అలాంటి సినిమా తీయాల్సింది కాదు. అదో చెత్త సినిమా అని విక్రమ్ వ్యాఖ్యానించారు.

Director Vikram Kumar calls Alai movie very bad!

'అలై' సినిమా తనకు ఎన్నో పాఠాలు నేర్పింది. సినిమా ఎలా తీయకూడదో ఆ తర్వాత అర్థమైందని విక్రమ్ చెప్పాడు. నిజంగానే తాను చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్న విక్రమ్ తర్వాత 13బి, ఇష్క్, మనం లాంటి విజయవంతమైన చిత్రాలు చేసారు.

సూర్యతో విక్రమ్ చేస్తున్న '24' సినిమా విషయానికొస్తే.... సూర్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందుతోన్న సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ '24'. ఈ చిత్రాన్ని గ్లోబల్ సినిమాస్, 2డి ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ కలయికలో స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 6న విడుదలవుతుంది.

English summary
Director Vikram Kumar had directed a Tamil film called Alai with Simbhu and Trisha. Made in 2003, the film which is a romantic drama turned out to be a failure. Now reminiscing about it in a latest interview, Vikram opened up that Alai was very bad film he had directed with poor screenplay penned by himself.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu