»   »  విక్రమ్ కుమార్ నెక్ట్స్... బన్నీ, మహేష్ బాబు, సూర్యలతో!

విక్రమ్ కుమార్ నెక్ట్స్... బన్నీ, మహేష్ బాబు, సూర్యలతో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మనం, 24 చిత్రాలు భారీ విజయం సాధించిన తర్వాత దర్శకుడు విక్రమ్ కె. కుమార్ స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. ఆయన తన తర్వాతి సినిమాలు మహేష్ బాబు, బన్నీ లాంటి పెద్ద స్టార్లతో చేయబోతున్నాడు. దీంతో పాటు సూర్యతో మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ కె. కుమార్ తన తర్వాతి ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అల్లు అర్జున్ కి ఆల్రెడీ ఓ స్టోరీ చెప్పానని, డిఫరెంట్ కమర్షియల్ జేనర్లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాను. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని తెలిపారు.

బన్నీతో సినిమా తర్వాత మహేష్ బాబుతో ఓ ఫ్రెష్ స్క్రిప్టుతో సినిమా ఉంటుందని చెప్పిన విక్రమ్ కుమార్... సూర్యతో మరో సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. అయితే ఇది 24 చిత్రానికి సీక్వెల్ మాత్రం కాదన్నారు.

Director Vikram Kumar reveals his next Projects

24 చిత్రానికి ముందే బన్నీకి విక్రమ్ కుమార్ కథ వినిపించాడు. బన్నీకి స్టోరీ నచ్చినా..... 24 సినిమా ఫలితం తర్వాతే నిర్ణయం తీసుకోవాలని వెయిట్ చేసాడు. ఇపుడు 24 మూవీ పెద్ద హిట్ కావడంతో విక్రమ్ కుమార్ ను పిలిచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు బన్నీ.

వాస్తవానికి 24 సినిమా స్టోరీ మొదట మహేష్ బాబుకే చెప్పాడట విక్రమ్ కుమార్. అయితే ప్రయోగాలు చేయడం ఇష్టం లేని మహేష్ బాబు ఈ స్క్రిప్టును రిజెక్ట్ చేసాడు. 24 సినిమాతో విక్రమ్ కుమార్ టాలెంట్ చూసిన తర్వాత మహేష్ బాబు కూడా ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. 24 సినిమా సమయంలోనే విక్రమ్ కుమార్ వర్కింగ్ స్టైల్ చూసి ఫిదా అయిపోయిన సూర్య ఆయనతో మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు.

English summary
Director Vikram k Kumar himself has confirmed that his next immediate project would be with Allu Arjun and that would be a different commercial genre. Later he would be directing Mahesh Babu for a fresh script and finally he would be directing Suriya once again.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu