దిల్ రాజు బాగా సెల్పీష్.. సుకుమార్ కూడా అంతే.. డైరెక్టర్ విశాల్ కాశీ కామెంట్స్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో యువ హీరో ఆశీష్ నటించిన కొత్త చిత్రం సెల్ఫీష్. ఈ శరవేగంగా షూటింగ్ ముగించుకొని మూవీ రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరో ఆశీష్ బర్త్ డే సందర్భంగా తొలి పాటను రిలీజ్ చేశారు.దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం తొలి పాట ఆవిష్కరణ మీడియా పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా నూతన దర్శకుడు విశాల్ కాశీ మాట్లాడుతూ..
సుకుమార్ షాడో మా పక్కన :మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా వర్క్ చేశాను. ఆయన నాకు గురువు లాంటి వారు. అసిస్టెంట్లను ఆయన పిల్లల మాదిరిగా చూసుకొంటారు. ఆయన షాడో మా పక్కన ఉంటుంది. ఒక సమయంలో ఆయనకు ఓ పాయింట్ చెప్పడం జరిగింది. ఆయన ఎక్సైట్ అయి వర్క్ చేశాం. దిల్ రాజు ఈ సినిమాకు కరెక్ట్. నేను కథలు చెప్పగానే.. సింగిల్ సిట్టింగ్‌లో ఒకే చెప్పారు. దాంతో సెల్ఫీష్ సినిమా ప్రయాణం మొదలైంది అని నూతన దర్శకుడు విశాల్ కాశీ అన్నాడు.

ఆ ఇద్దరు సెల్ఫీష్ అంటూ : నేను సెల్ఫీష్ కథ చెప్పిన సమయంలో దిల్ రాజు, సుకుమార్ ఆర్య సినిమా గురించి మాట్లాడుకొంటున్నారు. సీన్ కంప్లీట్ కాగానే క్రికెట్ ఆడుకొనే వారమని చెప్పారు. దిల్ రాజు, సుకుమార్ ఇద్దరు సెల్ఫీష్‌లే. ఈ సెల్ఫీష్ పాయింట్ వారికి కనెక్ట్ అయింది. ఈ సినిమా మాస్ లవ్ స్టోరి. ఒక టైమ్‌లో సుకుమార్ మాట్లాడుతూ.. రాజు గారు నా గురువు అని చెప్పారు. నా గురువు సుకుమార్. ఆయన గురువు దిల్ రాజు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా సెల్ఫీష్ అని విశాల్ కాశీ చెప్పాడు.

జీవితాంతం రుణపడి ఉంటాను : ఆర్య మూవీ తర్వాత 19 ఏళ్ల అనంతరం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్ బ్యానర్లు కలిసి చేస్తూ నాకు సెల్ఫీష్ సినిమా అవకాశం ఇచ్చారు. అదే బ్యానర్‌లో ఆయన శిష్యుడిని ఇంట్రడ్యూస్ చేయడం లక్కీగా భావిస్తున్నాను. దిల్ రాజు, సుకుమార్, శిరీష్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే మా హీరో బర్త్ డే బాయ్ ఆశీష్.. సెల్ఫీష్ సినిమాలో రఫ్ ఆడించాడు అని దర్శకుడు విశాల్ కాశీ చెప్పాడు.

లవ్ టుడే ఇవానాతో మంచి కెమిస్ట్రీ : సెల్ఫీష్ సినిమా కథ విషయానికి వస్తే.. బస్ టికెట్, రైల్ టికెట్ మనం రిజర్వేషన్ చేసుకొన్నట్టు.. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని రిజర్వు చేసుకొంటారు. లవ్ టుడేలో నటించిన ఇవానా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నది. ఆశీష్, ఇవానా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఈ సినిమాలోని దిల్ కుష్ పాటకు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి మంచి పాటను రాసి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అని విశాల్ కాశీ అన్నాడు.

దిల్ కుష్ పాట కొత్త కొణంలో : ఇప్పటి వరకు ఎన్నో గొప్ప పాటలు విని ఉంటాం. లవ్ సాంగ్స్‌లో కొత్త ఎక్స్‌ప్రెషన్, కొత్త కోణంలో పాటను చేశాం. అందరికి నచ్చుతుంంది. కానీ సెల్ఫీష్ మూవీలోని దిల్ కుష్ సాంగ్ మెలోడిగా సాగుతుంది. నాకు మంచి అవకాశం ఇచ్చిన దిల్ రాజు, సుకుమార్, శిరీష్, ఆశీష్ అందరికీ నా ధన్యవాదాలు అంటూ దర్శకుడు విశాల్ కాశీ అన్నాడు.


Click it and Unblock the Notifications











