అదీ పవన్ కళ్యాణ్ డెడికేషన్ అంటూ మురిసిపోతున్న డైరక్టర్
పవన్ కళ్యాణ్ షాట్ షెడ్యూల్ కి అరగంట ముందే చేరుకుంటున్నారు. దాంతో మేము కరెక్టుగా ఆరు గంటలకే షూటింగ్ ప్రారంభించగలగుతున్నాం. ఇదే ఆయనకు సినిమా మీద ఉన్న ప్రేమ,వృత్తిమీద ఉన్న శ్రద్ద. ఆయన తన పాత్రకు నూటికి రెండువందల పాళ్ళు న్యాయం చేస్తున్నారు. ఈ సినిమా చాలా బాగా షేప్ అవుతోంది. ఫెరఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది అంటూ చెప్పుకొచ్చారు దర్సకుడు విష్ణు వర్ధన్.పవన్ కళ్యాణ్ తో ఆయన షాడో చిత్రం రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఐదు గురి జీవితాలకు సంబందించిన కథతో రూపుదిద్దుకుంటోందని తెలుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ పోషించే పాత్రలో కాస్త నెగటివ్ టచ్ కూడా కనిపిస్తుందని తెలుస్తోంది. అడవి శేషు, సంపత్ రాజ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సారా జేన్ దియాస్, అంజలి లవేనియా ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











