'బెజవాడ రౌడీలు' ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ అంటున్నాడు
బెజవాడ రౌడీలు సినిమా ఒక లవ్ స్టోరీ అని..ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ అని దర్సకుపడు వివేక్ చెప్పుతున్నారు. బెజవాడ రౌడీలు టైటిల్ వివాదాన్ని పరిష్కరించేందుకు..దర్శకుడు వివేక్ రంగంలోకి దిగారు. టైటిల్ మార్చకుండానే షూటింగ్ జరుపుకునేందుకు అనుమతివ్వాలని బెజవాడ ప్రజాసంఘాలను కోరుతున్నారు. అలాగే సినిమాలో ఎలాంటి రౌడీయిజం కానీ..బెజవాడకు చెందిన బ్యాక్ డ్రాప్ ఎలాంటిది కూడా ఉండదని హామీ ఇస్తున్నారు. ఎలాంటి రౌడీల నేపథ్యం కానీ.. ఎలాంటి హింసాత్మక ఘటనలు కానీ ఉండబోవని అంటున్నారు.
విజయవాడ చరిత్రను ఎక్కడా చూపడం లేదని ప్రజాసంఘాల ప్రతినిధులకు చెప్పారు. టైటిల్ పై వివాదం వద్దని విజ్ఞప్తి చేశారు. దీనిపై తమ అభిప్రాయాలు చెప్పాలంటూ.. వివేక్ కోరారు. ఈ విషయంలో మెట్టుదిగిన డైరెక్టర్..ప్రజాసంఘాలు, పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమా స్టోరీకి.. టైటిల్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొస్తున్నారు. అదే టైటిల్ తో బెజవాడలోనే షూటింగ్ జరిపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల 10 నుంచి షూటింగ్ మొదలవుతుందని..నాగచైతన్య కూడా షూటింగ్ లో పాల్గొంటారని చిత్ర యూనిట్ తెలిపింది.


Click it and Unblock the Notifications











