For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరో ఉదయ్ కిరణ్ మార్కెట్ 400కోట్లు.. సీనియర్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

  |

  తెలుగు చిత్ర పరిశ్రమలో ఆడియెన్స్ నుంచి మొదటి సినిమాతోనే ఒక మంచి పాజిటివ్ ఇంప్రెషన్ ని అందుకున్న హీరోల్లో ఉదయ్ కిరణ్ ఒకడు. అన్ని వర్గాల అభిమానులు అతన్ని ఇష్టపడేవారు. ఇటీవల ఉదయ్ కిరణ్ జయంతి సందర్భంగా.. అభిమానులు సోషల్ మీడియా ద్వారా కూడా ఉదయ్ కిరణ్ గుర్తు చేసుకుంటూ.. అలాంటి హీరో మళ్ళీ రాలేడని కామెంట్ ఎన్నో చేశారు. ఇక రీసెంట్ గా ఉదయ్ తో రెండు సినిమాలను డైరెక్ట్ చేయడమే కాకుండా ఒక హిట్టు సినిమాను కూడా అందుకున్న బాక్సాఫీస్ డైరెక్టర్ అతని మార్కెట్ పై స్పందించాడు.

   ఆ సినిమాలతోనే స్టార్ డమ్..

  ఆ సినిమాలతోనే స్టార్ డమ్..

  2000వ సంవత్సరంలో మొదట తేజ డైరెక్షన్ లో చిత్రం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్ కొన్నాళ్లకే స్టార్ హీరోల రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్నాడు. నువ్వు నేను - మనసంతా వంటి సినిమాలు ఉదయ్ స్థాయిని ఒక్కసారిగా పెంచేశాయి. యూత్ లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా ఉదయ్ కి మంచి క్రేజ్ ఏర్పడింది.

  అడల్ట్ వెబ్ సిరీస్ ‘గంధీబాత్' ఫేం అన్వేషీ జైన్ హాట్ ఫొటోలు

   హీరో అవ్వాలని అనుకోలేదట..

  హీరో అవ్వాలని అనుకోలేదట..

  చూస్తుండగానే గ్యాప్ లేకుండా మొదట్లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో తన క్రేజ్ ని పెంచుకున్న ఉదయ్ కొన్నాళ్ళు ప్రేమలకు సంబంధించిన వివాదాలతో ఇబ్బంది పడ్డాడు. కెరీర్ మొదట్లోనే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న ఉదయ్ హీరోగా అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదట. ఒక యాక్టర్ గా కొనసాగాలని మాత్రమే ప్రయత్నాలు చేశాడు.

  షాక్ ఇచ్చిన సూసైడ్

  షాక్ ఇచ్చిన సూసైడ్

  అనుకోకుండా ఎదురైన పరాజయాలు ఉదయ్ కిరణ్ జీవితాన్ని ఉహీంచని విధంగా బాధకు గురి చేశాయి. అయితే 2014లో హైదరాబాద్ లోని తన ఫ్లాట్ లోనే సూసైడ్ చేసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది. అప్పట్లో ఈ విషాదం అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా ఎంతో బాధకు గురి చేసింది.

  అలా జరిగితే పరిస్థితి మరోలా ఉండేది

  అలా జరిగితే పరిస్థితి మరోలా ఉండేది

  అయితే ఉదయ్ కిరణ్ మార్కెట్ మొదట్లో ఎవరు ఊహించని విధంగా ఉండేదట. ఉదయ్ తో రెండు సినిమాలు డైరెక్ట్ చేసిన VN ఆదిత్య ఒక ఇంటర్వ్యూలో హీరో మార్కెట్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. నిజంగా ఉదయ్ కు ఒక్క సినిమాతో సక్సెల్ ట్రాక్ లోకి వచ్చినా కూడా పరిస్థితి మరోలా ఉండేదని దర్శకుడు తేజ కూడా అప్పట్లో చాలానే చెప్పారు.

  మనసంతా నువ్వే ఎంత కలెక్ట్ చేసిందంటే?

  మనసంతా నువ్వే ఎంత కలెక్ట్ చేసిందంటే?

  VN ఆదిత్య మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ తో నేను రెండు సినిమాలు చేశాను. మొదట మనసంతా నువ్వే, ఆ తరువాత శ్రీరామ్ సినిమాను చేశాను. మనసంతా నువ్వే ఒక బ్లాక్ బస్టర్ హిట్. 1కోటి 30లక్షల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమా 16కోట్ల దాకా వసూలు చేసింది. అయితే శ్రీరామ్ మాత్రం యావరేజ్ హిట్ గా నిలిచింది.. అంటూ ఆదిత్య తెలియజేశారు.

  ఇప్పుడైతే ఆ మార్కెట్ 400కోట్లు..

  ఇప్పుడైతే ఆ మార్కెట్ 400కోట్లు..


  ఉదయ్ కిరణ్ కు అప్పట్లో ఉన్న ఫాలోయింగ్ అలాగే సినిమా కలెక్షన్స్ అప్పటి స్టార్ హీరోల రేంజ్ లో ఉండేది. ఒక విధంగా వారసులకు కూడా అంత మార్కెట్ లేదు. ఎక్కువగా యూత్ కు నచ్చే విదంగా కథలు సెలెక్ట్ చేసుకున్నాడు. ఒకవేళ అతను బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇప్పటి మార్కెట్ తో పోలిస్తే దాదాపు 400కోట్లు ఉండేదని అంటూ.. అతను మరణించినప్పుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యానని ఆదిత్య తెలిపాడు.

  ఉదయ్ కిరణ్ చివరి సినిమా రిలీజ్ అవుతుందా?

  ఉదయ్ కిరణ్ చివరి సినిమా రిలీజ్ అవుతుందా?

  అయితే ఉదయ్ కిరణ్ చివరి సినిమా రిలీజ్ కాకుండానే అటకెక్కడం అప్పట్లో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. 'చిత్రం చెప్పిన కథ' అనే సినిమాలో ఆఖరి సారిగా నటించిన ఉదయ్ కిరణ్ ఆ సినిమా రిలీజ్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కొన్ని ప్రమోషన్స్ ఈవెంట్స్ లో కూడా పాల్గొన్నారు. కానీ ఆర్థిక కారణాల వల్ల ఆ సినిమా రిలీజ్ కాలేదు.ఉదయ్ ఆత్మహత్య అనంతరం ఆ సినిమా గురించి ఎవరు పట్టించుకోలేదు. ఇక ఇన్నాళ్లకు ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

  English summary
  Uday Kiran's last film release was big suspension. Uday Kiran, who made his last appearance in the movie 'chitram cheppina Katha', made many attempts to release the film. Also participated in some promotions events. But after Uday's suicide, who cares about the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X