జూ ఎన్టీఆర్ లో పరిణితి వచ్చింది
వయసుతోపాటు ఎన్టీఆర్ ఆలోచనల్లోనూ, భావ వ్యక్తీకరణలోనూ..అన్నింటా ఎంతో మార్పు, పరిణతి వచ్చింది అంటూ తన సన్నిహితుడు గురించి దర్శకుడు వివివినాయిక్ చెప్పుకొచ్చారు. ఆయన ఎన్టీఆర్ తో చేసిన తాజా చిత్రం రేపు(బుధవారం) రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఎన్టీఆర్ ని బాగా దగ్గరగా మెసిలే మీకు..'ఆది'కీ 'అదుర్స్'కీ ఏం మార్పు కనిపించింది అని అడగగా..ఎన్టీఆర్ లో అద్భుతమైన నటుడు ఉన్నాడు అని ఆది ప్రారంభం రోజే అందరూ చెప్పారు. ఇక వయసుతోపాటు ఎన్టీఆర్ ఆలోచనల్లోనూ, భావ వ్యక్తీకరణలోనూ..అన్నింటా ఎంతో మార్పు, పరిణతి వచ్చింది. ప్రధానంగా దేహాన్ని తీర్చిదిద్దుకొన్న తీరు బాగుంది. అప్పట్లో బొద్దుగా ఉండేవాడు. ఫిజిక్ గురించి అంత శ్రద్ధ తీసుకొనేవాడు కాదు. ఏ నటుడికైనా దేహధారుఢ్యం అనేది ఎంతో ప్రధానమైనది. దాన్ని గ్రహించి తీసుకొంటున్న శ్రద్ధ బాగుంది. అలాగే సన్నివేశాల్ని పండించడంలోనూ ఎంతో పరిణతి కనబరుస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. ఇక అదుర్స్‌లోని రెండు పాత్రల్నీ సమర్థంగా పోషించారు ఎన్టీఆర్. అలా చేయడం ఎన్టీఆర్‌కే సాధ్యం అంటూ మెచ్చుకుంటున్నారు వినాయక్.


Click it and Unblock the Notifications











