ఎన్టీఆర్ మణికట్టుకు గాయం.. డాక్టర్లు భయంతో ప్రాణం పోతుందని అన్నారు: వివి.వినాయక్

ఆది, దిల్ వంటి సినిమాలతో కెరీర్ మొదట్లోనే మంచి క్రేజ్ అందుకున్న దర్శకుడు వివి.వినాయక్. ఈ దర్శకుడు ఎలాంటి సినిమాలు చేసినా కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని కలగలిపి ఫుల్ మీల్స్ లా రెడీ చేస్తాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక చాలా రోజుల తరువాత ఈ దర్శకుడు అలీతో సరదాగా ఇంటర్వ్యూలో తన కెరీర్ కి సంబంధించిన అనేక రకాల ముఖ్యమైన విషయాలను బయటపెట్టాడు. ముఖ్యంగా ఆది సినిమా షూటింగ్ లోని తారక్ గాయం గురించి కూడా చెప్పాడు.

చాలా రోజుల తరువాత వినాయక్

చాలా రోజుల తరువాత వినాయక్


వివి.వినాయక్ చాలా వరకు పర్సనల్ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడు. సినిమాల విడుదల సమయంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు. ఇక కమెడియన్ అలీ షోలో పాల్గొన్న ఈ సీనియర్ దర్శకుడు చాలా రకాల సందేహాలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అందుకు సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తారక్ చేతికి గాయం.. రక్తం కారుతూనే ఉంది

తారక్ చేతికి గాయం.. రక్తం కారుతూనే ఉంది

ఆది సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కి ఎదురైన ఒక ప్రమాదం గురించి కూడా వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఒక ఎమోషనల్ యాక్షన్ సీన్ చిత్రీకరణ సమయంలో అనుకోకుండా ఎన్టీఆర్ చేతికి గాయమయ్యింది. మణికట్టు వద్ద కత్తి తగిలి తెగింది. ఒక్కసారిగా రక్తం కారిపోతూనే ఉంది. భయంతో వెంటనే తారక్ ను అలా హాస్పిటల్ కి తీసుకువెళ్ళాం.

ఏదైనా అయితే నా ప్రాణం పోతుంది

ఏదైనా అయితే నా ప్రాణం పోతుంది

ఆ గాయం చూసిన డాక్టర్ మమ్మల్ని భయపెట్టేశాడు. మణికట్టు వద్ద చాలా సెన్సిటివ్ నరం ఉంటుంది. ఏదైనా అయితే నా ప్రాణం పోతుంది అంటూ డాక్టర్ కంగారు పడ్డాడు. నిజంగా ఆ విషయం గుర్తుకువస్తేనే భయం వేస్తోంది. అది అంత చిన్న విషయం కాదు. ఇప్పటికి కూడా ఆ గాయం గుర్తు తారక్ చేతిపై అలానే ఉంటుంది అంటూ దర్శకుడు వివి.వినాయక్ షాక్ అవుతూ వివరణ ఇచ్చారు. ఆది సక్సెస్ అనంతరం వినాయక్.. తారక్ తో సాంబ, అదుర్స్ వంటి సినిమాలు చేసిన విషయం తెలిసిందే.

Recommended Video

ఇండస్ట్రీ లో ఆయనే నా 'గాడ్ ఫాదర్'!!
పెళ్లి కాకపోతే ఏమవుతుంది..

పెళ్లి కాకపోతే ఏమవుతుంది..

ఇక తన కెరీర్ మొదటి విషయాలను కూడా గుర్తు చేసుకున్న వినాయక్ ముద్దు పేరు నాని అంటూ దర్శకుడు అవుతాను అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని సినిమా వాళ్ళు అంటేనే ఎవరు కూడా పిల్లను ఇవ్వరని, పెళ్లి అవ్వదని అంటూండేవారు. ఇక మా నాన్నతో ఒకరోజు గొడవపడి పెళ్లి చేసుకొని ఏం చేయాలి, కాకపోతే ఏమవుతుందని గొడవ కూడా పడ్డాను అంటూ వినాయక్ మాట్లాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X