ఛత్రపతి రీమేక్ చేయడానికి భయమేసింది.. డైరెక్టర్ వినాయక్ షాకింగ్ కామెంట్స్

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఛత్రపతి మూవీని అదే పేరుతో బెల్లంకొండ శ్రీనివాస్ తో వివి వినాయక్ రీమేక్ చేశారు. ఈ మూవీ మే 12న రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ చిత్రాన్ని హిందీలో ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి.

వివి.వినాయక్ చాలా రోజుల తర్వాత మెగా ఫోన్ పట్టి చేసిన మూవీ ఇది కావడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ఛత్రపతి హిందీ మూవీ ప్రమోషన్స్ ప్రెస్ మీట్ తో వివి వినాయక్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాపై రీమేక్ చేయడంపై విలేకరుల అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు.

Director VV Vinayak Shocking comments on chatrapathi Remake fear

ఛత్రపతి రీమేక్ చేయడానికి ముందు భయమేసిందని అన్నారు. స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కావడంతో రీమేక్ అనేసరికి కచ్చితంగా కంపారిజన్ ఉంటుంది. అయితే బెల్లంకొండ సురేష్ మాత్రం పట్టుపట్టి చేయగలవు అంటూ ఒప్పించి నాతో చేయించారు. ఇక రీమేక్ విషయంలో పెద్దగా మార్పులు అయితే చేయలేదు.

ఉన్న ఫీల్, ఎమోషన్ చెడగొట్టకుండా చేయడమే అసలైన పని. ఆ పని కరెక్ట్ గా చేసానని అనుకుంటున్నా. అలాగే కొన్ని ఐకానిక్ షాట్స్ లో అయితే అస్సలు మార్పు చేయలేదు. అవి అలా ఉంటేనే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. అలాగే నా స్టైల్ లో కొన్ని చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ని కూడా ఇందులో పెట్టడం జరిగిందని వినాయక్ చెప్పుకొచ్చారు.

Director VV Vinayak Shocking comments on chatrapathi Remake fear

అలాగే ఈ మూవీ రీమేక్ ఈ జెనరేషన్ యూత్ కి ఫ్రెష్ గా ఆకట్టుకోవడం మాత్రం ఖాయం. అలాగే ఇప్పటికే తెలుగు ఛత్రపతి చూసిన వారు మాత్రం కచ్చితంగా చెడగొట్టకుండా చేసానని అంటారు అని మూవీ సక్సెస్ పై తన కాన్ఫిడెన్స్ ని వినాయక్ వ్యక్తం చేశారు. మరి ఈ చిత్రం బెల్లంకొండ శ్రీనివాస్ కి హిందీలో ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X