హీరోలేం పనికి వస్తారు?
దర్శకులే హీరోలని ఒకసారి పూరి జగన్నాథ్ అన్నమాట బుధవారం నిజమైంది. వివరాలు ఇలా ఉన్నాయి... యువ దర్శకుడు శేఖర్ కమ్ముల తన సినిమా హ్యాపీడేస్ నడుస్తున్న దేవి 70ఎమ్ఎమ్ థియేటర్ కు పంపిణీదారుడు దిల్ రాజుతో కలిసి వెళ్లాడు. థియేటర్లలో ప్రేక్షకుల స్పందనను స్వయంగా చూశాడు. సినిమా ప్రదర్శన ముగిసిన తరువాత శేఖర్ కమ్ముల, దిల్ రాజు బయటకు రాగానే ప్రేక్షకులు శేఖర్ కమ్ములను చుట్టుముట్టారు. ఆటోగ్రాఫ్ లకు పోటీ పడ్డారు. తమ వద్ద పేపర్ లేని వారు చేతి మీద శేఖర్ కమ్ముల ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఇలా శేఖర్ కమ్ముల చుట్టూ మూగిన ప్రేక్షకులందరూ అమ్మాయిలే కావడం విశేషం. ఈ అమ్మాయిలు కేరింతలు కొట్టారు కూడా. ప్రేక్షకుల అభిమానానికి శేఖర్ కమ్ముల ఆనందం మాటల్లో వర్ణించడం సాధ్యమా. హ్యాపీడేస్ సినిమా విజయంలో హీరో ఎవరంటే శేఖర్ కమ్ముల అనే కదా చెప్పేది.


Click it and Unblock the Notifications











