చూసిన తరువాత మాట్లాడండి.. ఫ్యామిలీ మ్యాన్ 2 కాంట్రవర్సీ పై దర్శకుల రియాక్షన్..

అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ద ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ ఇటీవల అంచనాల డోస్ ను గట్టిగానే పెంచేసింది. ముఖ్యంగా సమంత పాత్రపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆమె ఒక టెర్రరిస్ట్ గా కనిపించబోతున్నట్లు ముందు టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

ఇక ట్రైలర్ అనంతరం తమిళనాడు నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడ్డాయి. వెబ్ సిరీస్ ను రిలీజ్ చేయవద్దని బ్యాన్ చేయాలని అంటూ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ అయ్యాయి. ఎందుకంటే సమంత పాత్ర తమిళ హక్కుల కోసం పోరాడిన టైగర్ల తరహాలో ఉందని వారిని కించపరిచే విధంగా చూపించారని ఆరోపణలు వచ్చాయి. కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా సిరీస్ ను అడ్డుకోవాలని లేక ద్వారా తెలియజేయడంతో బ్రేకులు పడే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది.

Directors raj and dk about the family man web series controversy

ఇక ఈ వివాదంపై వెబ్ సిరీస్ దర్శకులు రాజ్ డీకే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ట్రైలర్ చూసి అంచనాకు రావడం కరెక్ట్ కాదు. ఎవరి మనోభావాలు దెబ్బ తినేలా రూపొందించలేదు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 రిలీజ్ అయ్యే వరకు కాస్త ఆగండి.

ఎక్కువగా తమిళ్ నటీనటులు నటించిన ఈ కంటెంట్ అందరికి నచ్చే విధంగానే ఉంటుంది. తమిళ సంస్కృతి పట్ల అలాగే ఆ ప్రాంత జనాల పట్ల మాకు అమితమైన గౌరవం ఉంది.. ఈ సిరీస్ కోసం ఎంతో కష్టపడ్డాం. దయచేసి తప్పుగా అనుకోకుండా సిరీస్ చూసిన తరువాత ప్రశ్నిస్తే ఒక అర్థం ఉంటుందని వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X