దృశ్యం దర్శకుడి ఆరోగ్య పరిస్థితి విషమం.. చావు బతుకుల్లో హైదరాబాద్‌లో చికిత్స
బాలీవుడ్ దర్శకుడు, దృశ్యం ఫేమ్ నిషికాంత్ కామత్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు సమాచారం. తాజా రిపోర్టు ప్రకారం నిషికాంత్ కామత్ గతంలో లివర్ సిర్హోసిస్‌తో బాధపడుతూ చికిత్స తీసుకొన్నారు. అయితే అదే వ్యాధి ఇప్పుడు మళ్లీ తిరగదోడిందనే విషయం తెలిసింది.
నిషికాంత్ కామత్ 2004లో హవా అనీ దే అనే చిత్రంలో నటించడం ద్వారా సినీ ప్రయాణం ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత పలు మరాఠీ చిత్రాల్లో నటించారు. మలయాళ చిత్రం దృశ్యం చిత్రాన్ని అదే పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేయడం ద్వారా నిషికాంత్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది.

2008లో ముంబై మేరీ జాన్ చిత్రం ద్వారా నిషికాంత్ దర్శకుడిగా మారారు. మదారీ, ఫంగే, ఫోర్స్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుడిగా జాన్ అబ్రహం నటించిన రాకీ హాండ్సమ్ చిత్రంలో కూడా నటించారు. ప్రస్తుతం దర్బాదార్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2022లో రిలీజ్‌కు ప్లాన్ చేశారు.


Click it and Unblock the Notifications











