twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'డర్టీ పిక్చర్'పై ముషీరాబాద్ లో ఎటాక్

    By Srikanya
    |

    సిల్క్ స్మిత జీవితం ఆధారంగా విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన డర్టీ పిక్చర్ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రదర్శన ఆపాలని ముషీరాబాద్ లోని సాయి రాజా ధియోటర్ వద్ద ఈ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఓ ధర్నా నిర్వహించారు. చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలని వారి ప్రధాన డిమాండ్. చిత్రంలో చాలా అసభ్యకరమైన సన్నివేసాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆపాలని ధియోటర్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ వారు స్లోగన్స్ చెప్పారు.

    ఈ సందర్భంగా ఎఐఎస్ ఎఫ్ జనరల్ సెక్రటరీ ఈశ్వరయ్య మాట్లాడుతూ..చిత్రంలోని అసభ్యకరమైన సన్నివేశాలు వల్ల పిల్లల మనస్సులు చెడి, వారి కెరీర్స్ పాడవుతాయని అన్నారు. అలాగే ఇలాంటి సన్నివేసాలు డైలాగ్స్ ఉన్న చిత్రానికి సెన్సార్ ఎట్లా ఇచ్చారని ధ్వజం ఎత్తారు. తక్షణం ప్రభుత్వం ఈ చిత్రాన్ని సెన్సార్ చేసిన సభ్యులపై యాక్షన్ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే తమ ఫెడరేషనే ధియోటర్స్ వద్ద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక ఈ ధర్నా జరుగుతూండగా..పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు.

    English summary
    Tension prevailed at Sai Raja Theatre, Musheerabad when hundreds of students under the aegis of All India Students Federation (AISF) on Tuesday staged a protest in front of the theatre demanding ban on Dirty Picture.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X