‘ది డర్టీ పిక్చర్’రీమేక్ లో హాట్ ఐటం గర్ల్
విద్యాబాలన్ నటించిన 'ది డర్టీ పిక్చర్' కలెక్షన్స్ బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షాక్ అయ్యేలా చేసిన సంగతి తెలిసిందే. సిల్స్ స్మిత జీవతం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బెంగాళీలో రీమేక్ గా రూపొందుతోంది. ఈ రీమేక్ లో బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ నటిస్తున్నట్లు సమాచారం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి శతాబ్ది రాయ్ దర్శకత్వం వహిస్తోంది. శతాబ్ది రాయ్ ..నటి నుంచి పొలిటీషన్ గా ఎదిగి పార్లమెంట్ కి వెళ్లుతున్న దర్శకురాలు.
ఈ విషయమై రాఖీ సాంవత్ మాట్లాడుతూ..ఈ చిత్రం ఓ ఐటం గర్ల్ నిజ జీవితానికి సంభదించింది. నేను బాలీవుడ్ ఒరిజనల్ ఐటం గర్ల్ ని కావటంతో ఆ పాత్రలో లీనమై నటించగలనని నమ్ముతున్నా. నాకు విద్యా అంటే ఇష్టం...ఆమె డర్టిపిక్చర్ లో చాలా బాగా చేసింది. అయితే ఆమె కన్నా బాగా చేస్తాను. ఈ సినిమా తర్వాత అందరూ నా పేరే స్మరిస్తారు అంది. అలాగే దర్శకురాలను ఇప్పటికే స్క్రిప్టు మొత్తం ఇవ్వమని అడిగాను. హిందీలో డైలాగులు రాసుకుని నేనే డబ్బింగ్ చెప్తాను. గతంలో శతాబ్ది దర్శకత్వంలో నేను ఓ ఐటం సాంగ్ కూడా చేసాను అంది.
ఇక ఇప్పటికే కన్నడంలో ఈ చిత్రం తయారవుతోంది. పాకిస్దాన్ శృంగార నటి వీణా మాలిక్ నటిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమా పేరు 'డర్టీ పిక్చర్.. సిల్క్ సకత్‌హాట్‌మగ'. ఈ చిత్రాన్ని రైట్స్ తీసుకోకుండా చేస్తూండటంతో ఏక్తా కపూర్ నోటీసులు పంపింది. ఈ విషయమై రాఖీ సాంవత్ స్పందిస్తూ...నాకు ఏక్తా అటువంటి నోటీసులు పంపదనే భావిస్తున్నాను. ఎందుకంటే నా గురించి ఏక్తాకు బాగా తెలుసు. అలాగే నా డైరక్టర్..పార్లమెంట్ లో ఉండే పొలిటీషియన్ అంది.
ఇంతకీ మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు అని అడిగితే..సల్మాన్ ఖాన్ చేసుకున్నప్పుడు అని శెలవిచ్చింది. అలాగే స్వయంవర్ 2 చేసి తన భర్తను ఎంపిక చేసుకుంటానని అంది. ఈ డర్టీ పిక్చర్ రీమేక్ తర్వాత తన కెరీర్ పూర్తిగా మారుతుందని భావిస్తున్నాని అంది. ఇప్పటివరకూ చిన్న చిన్న పాత్రలు,ఐటం సాంగ్ లు చేసుకునే తనకు ఇది పూర్తిగా నటించే అవకాశమిచ్చే సినిమా కాబట్టి నా శాయిశక్తులా కృషి చేస్తానని మాట ఇచ్చింది. తన అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచనని అంది.


Click it and Unblock the Notifications











